విస్తరించనున్న 5జీ సేవలు

న్యూఢిల్లీ ముచ్చట్లు:


భారతదేశంలో 5జీ సేవలు విస్తరించనున్నాయి. త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో 5జీ స్పెక్ట్రం వేలానికి టెలికాం శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజలు, వాణిజ్య సంస్థలకు 5జీ సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత 4జీ సేవలతో పోలిస్తే.. 5జీ సేవలు 10 రెట్ల వేగాన్ని కలిగి ఉంటాయని కేబినేట్ వెల్లడించింది.20 ఏళ్ల వ్యాలిడిటీతో మొత్తం 72097.85 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రంను జులై నెలలో వేగం ప్రక్రియను ముగించనుంది. భారత్‌లో 5జీ ఎకోసిస్టంలో భాగంగా స్పెక్ట్రం వేలాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర టెలికాం, ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. 2021 సెప్టెంబర్‌లో ప్రకటించిన టెలికాం రంగ సంస్కరణల ప్రకారం.. యూసేజ్ ఛార్జీలు విధించరు. దీంతో టెలికాం నెట్‌వర్క్ ల నిర్వహణ వ్యయానికి సంబంధించి సర్వీస్ ప్రొవైడర్లకు ఊరట కలుగనుంది.

 

Tags: 5G services to be expanded

Post Midle
Post Midle
Natyam ad