6.11 లక్షల మంది రైతులకు  వంద శాతం చెల్లింపులు చేశాం

Date:14/06/2018
హైదరాబాద్ ముచ్చట్లు :
ఈ ఏడాది రబీ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వంద శాతం నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతి పైసాను ఆన్లైన్ ద్వారా రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ రబీలో 3313 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.11 లక్షల మంది రైతుల నుండి 35.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 5601.97 కోట్లు. ఈ నిధులను ప్రభుత్వం తరఫున పౌరసరఫరాల సంస్థ అన్ని జిల్లాలకు విడుదల చేసింది. ఈ రోజు (గురువారం, 14 జూన్) కూడా రూ. 349 కోట్లను జిల్లాలకు విడుదల చేయడం జరిగింది. దీంతో ధాన్యం కొనుగోలుకు సంబంధించి వంద శాతం నిధుల విడుదల పూర్తయింది. ఈ రూ. 349 కోట్లు కూడా బ్యాంకులు పనిదినాల్లో ఒకటి, రెండు రోజుల్లో రైతు ఖాతాల్లో జమ అవుతాయి.
పండుగను దృష్టిలో పెట్టుకొని రైతులకు చెల్లింపులతో పాటు హమాలీ, రవాణా, గన్నీ సంచులకు సంబంధించిన చెల్లింపులు కూడా పూర్తి చేశాం. ధాన్యం కొనుగోలు ప్రక్రియకకు సంబంధించి ప్రతి పైసా కూడా చెల్లింపు చేయడం జరిగింది. దళారుల ప్రమేయానికి ఏలాంటి ఆస్కారం లేకుండా ఆన్లైన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాలోకి కనీస మద్ధతు ధర చెల్లింపులను జమ చేయడం జరుగుతోంది. పౌరసరఫరాల సంస్థ దగ్గర నిధుల సమస్య లేదు. అవసరమైన నిధులున్నాయి అని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు.
Tags:6.11 lakh farmers have made a hundred percent payments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *