Natyam ad

రూ.6 కోట్లతో సోలార్‌ ప్లాంటు – కొండవీటి నాగభూషణం

– నెలరోజుల్లో పూర్తి

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

మున్సిపాలిటి పరిధిలో విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించేందుకు రూ.6 కోట్లతో ఒక మెగా వాట్స్ సోలార్‌ ప్రాజెక్టును నెల రోజులలోపు నిర్మించనున్నట్లు రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం తెలిపారు. మంగళవారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింప్రసాద్‌తో కలసి స్థానిక సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు వద్ద ప్లాంటు పనులకు భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు నెల రోజులలో సోలార్‌ ప్లాంటు పనులు పూర్తి చేయించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సుమారు నెలకు రూ.35 లక్షల రూపాయలు విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నామని, దీనిని పూర్తి స్థాయిలో తగ్గించేందుకు సోలార్‌ ప్లాంటును మంత్రి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా మున్సిపాలిటి మిగులు నిధులను వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించేలా మంత్రి ప్రణాళికలు సిద్దం చేశారని తెలిపారు. విద్యుత్‌ వినియోగాన్ని మున్సిపాలిటిలో పూర్తిగా తగ్గించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

Tags: 6 Crore Solar Plant – Kondaveeti Nagabhushanam

 

Post Midle