తెలంగాణలో సర్కారీ భూముల రక్షణ కోసం ఆరు కోట్లు

6 crores for the protection of sericulture in Telangana

6 crores for the protection of sericulture in Telangana

Date:16/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
  తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మండలాల్లో 10,938.76 ఎకరాల వరకు విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించిన కెసిఆర్ సర్కారు మరికొన్ని వేల ఎకరాలను గుర్తించే పనిలో ఉంది. రూ.14,284 కోట్లకు పైగా విలువ కలిగిన ఈ భూముల రక్షణకు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.6 కోట్లు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం-2013లోని లోపాలను సరిదిద్దేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ చేసిన సిఫార్సులు ప్రభుత్వానికి చేరాయి. హైదరాబాద్‌లోనే కాకుండా వేగంగా నగరీకరణ చెందుతున్న వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, కామారెడ్డి, భవనగిరి, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొంత మంది అధికారులు, సిబ్బంది ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యేందుకు సహకరిస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. కొత్త చట్టం అమలులోకి వస్తే ఇటువంటి అక్రమాలకు బాధ్యులైన అధికారులను ఉద్యోగం నుంచి తొలగించే అధికారాలను ప్రభుత్వం ప్రతిపాదిత చట్టంలో పొందుపరచనుంది. రాష్ట్రంలో అన్ని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడ అక్రమంగా రిజిస్ట్రేషన్ అవుతున్నా, మిగిలిన అధికారులకు సులువుగా తెలిసిపోతుంది. పైగా ప్రభుత్వ భూముల సమాచారం కూడా అందరు అధికారులు తెలుసుకునేందుకు వీలవుతుంది. ప్రతిపాదిత చట్టంలో కొత్త అంశాలను చేర్చనున్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతంలో కొనుగోలు దారులు రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్‌కు డాక్యుమెంట్లు ఇచ్చేవారు. ఇప్పుడా ప్రక్రియను మార్చనున్నారు. ఇకపై కొనుగోలుదారులు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు ఇవ్వాలి. ఈ డాక్యుమెంట్లను పరిశీలించి సరైనవా కావా అని 48 గంటల్లో రిజిస్ట్రేషన్ శాఖ తేల్చాలి. దీనివల్లప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడమేకాకుండా, కొనుగోలుదారులు ప్రభుత్వ భూములను, వివాదస్పద భూములను కొనుగోలు చేయకుండా నివారించేందుకు వీలవుతుంది. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం 2016-17లో రూ.8 కోట్లను కేటాయించింది. ఈ నిధులను జిల్లా కలెక్టర్లకు విడుదల చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారు. రంగారెడ్డి కలెక్టరేట్‌కు రూ.1.90 లక్షలు, మేడ్చెల్ కలెక్టర్‌కు రూ.1.26 లక్షలు మంజూరు చేశారు. ప్రభుత్వ భూముల చుట్టూ ప్రహరీ గోడను నిర్మించడం, స్తంబాలు పాతడం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం తదితర చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాల్లో రెవెన్యూ భవనాల నిర్మాణానికి రూ. 15 కోట్లను కేటాయించారు.
Tags: 6 crores for the protection of sericulture in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *