Natyam ad

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో ముస్లింలకు 6 శాతం రిజర్వేషన్‌ – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

– చంద్రబాబు తప్పుడు కేసులతో 4 శాతం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశే ఖర్‌రెడ్డి చలువతో ముస్లిం మైనార్టీలకు దేశంలోనే గుర్తింపు లభించిందని , ముస్లింలకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దేనని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ, గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి పట్టణంలో ముస్లింలకు ఇఫ్తార్‌విందు ఇచ్చారు. ఈ విందులో ఎంపీలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, జిల్లా కలెక్టర్‌ షన్‌మోహన్‌ తో కలసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మైనార్టీల సదస్సులో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న మైనార్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాల చేయూతనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మైనార్టీలకు అన్ని పదవుల్లోను రిజర్వేషన్లకు మించి అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. రాజన్న ప్రభుత్వం 6 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే, చంద్రబాబునాయుడు తప్పుడు కేసులు దాఖలు చేసి అడ్డుకున్నారని తెలిపారు. దీని కారణంగా సుప్రింకోర్టు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించిందన్నారు. రిజర్వేషన్ల ఫలితంగా ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింలకు అవకాశం లభించి, ఉన్నత స్థానాల్లో ఉన్నారని కొనియాడారు. మైనార్టీల అభివృద్ధి వైఎస్సార్‌ కుటుంబంతోనే సాధ్యమైందని కొనియాడారు. ముస్లిం మైనార్టీలకు ఏకష్టం వచ్చినా అండగా తమ కుటుంబం ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా ఒకొక్క మసీదుకు మంత్రి సొంత నిధులు రూ.15 వేలు చొప్పున 26 మసీదులకు నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లింలు మంత్రిని, ఎంపీలను , కలెక్టర్‌ను, ఎమ్మెల్యేలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్సీ భరత్‌, ఎమ్మెల్యేలు జంగాలపల్లి శ్రీనివాసులు, నవాజ్‌బాషా, చిత్తూరు మేయర్‌ హేమలత, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రెడ్డెప్ప, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఎంఎస్‌.సలీం తదితరులు పాల్గొన్నారు.

 

Tags; 6 percent reservation for Muslims with late Chief Minister YSR – Minister Peddireddy Ramachandra Reddy

Post Midle