60 thousand people in the care of the authorities

అధికారుల సంరక్షణలో 60 వేల మంది ప్రజలు

– పూర్తి భద్రతలో పుంగనూరు
– శానిటేషన్‌లో జిల్లాలోనే ప్రథమం

Date:07/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

స్వచ్చసర్వేక్షణ్‌ , స్వచ్చాంధప్రదేశ్‌ రంగాలలో దేశ స్థాయిలో మున్సిపాలిటిలతో పోటీ పడుతున్న పుంగనూరు మున్సిపాలిటిగా ఇప్పుడు ఏదిగిన 60 వేల మంది ప్రజల ఆరోగ్యాన్ని కంటికి రెప్పల కాపాడుతూ ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరులో తండ్రి, తనయుల ఆదేశాల మేరకు మున్సిపల్‌, మండల పరిషత్‌ , పోలీస్‌ అధికార సిబ్బంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరోనా విపత్తు నుంచి పూర్తి స్థాయిలో ప్రజలను సంరక్షించేందుకు ఆరోగ్య, వైద్య, పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు నిత్యవసర సరుకుల పంపిణీ విధానాలను కూడ పకడ్భంధిగా నిర్వహిస్తున్నారు.

 

 

 

ఆధాయము, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ప్లాస్టిక్‌ బహిష్కరణలలో దేశ,రాష్ట్ర స్థాయిలో అవార్డుల పంట పండించిన కమిషనర్‌ వర్మ సారధ్యంలో పట్టణం ఇప్పుడు కరోనా బారీన పడకుండ అప్రమత్తంగా ఉంది. గత మార్చి 22 న కరోనా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ప్రజారోగ్యం దృష్ట్యా భారీ ఎత్తున సోడియం హైపోక్లోరైడ్‌ , లయమ్‌ఫౌడర్‌, బ్లీచింగ్‌, మోలాథిన్ లను ఉపయోగిస్తూ ఏరోజుకు ఆరోజు మొత్తం 31 వార్డుల్లో పరిశుభ్రత కార్యక్రమాలు అత్యంత జాగ్రత్తలు నిర్వహిస్తున్నారు.

 

 

 

పట్టణం నుంచి ఇప్పటికే 70 మందికి పైగా క్వారంటైన్స్కు పంపబడ్డారు. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు వారి పనితీరులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రతి ఇంటి ఆరోగ్యాన్ని మదింపు చేస్తున్నారు. దీనికి తోడు పట్టణంలోని అన్ని నలుమూలలను దిక్భంధం చేస్తూ సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది పలు ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేస్తూ ప్రజలు బయట తిరగకుండ 144 సెక్షన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దీనికి తోడు మండల పరిషత్‌ అధ్యక్ష అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి , జెడ్పీటీసీ జ్ఞానప్రస్నన్న సారధ్యంలో ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు 23 పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పూర్తి స్థాయిలో తొలిదశ పారిశుద్ధ్యం, సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి, బ్లీచింగ్‌ చల్లడం లాంటి కార్యక్రమాలను కార్మిక సిబ్బందిచే పూర్తి చేయించారు. కరోనా విపత్తు నేపధ్యంలో ఇతర రాష్ట్రల నుంచి మండలంలోని ఆరడిగుంట, అడవినాథునికుంట, జౌకొత్తూరు వంటి సరిహద్దు గ్రామాలకు తరలివచ్చిన వారిని స్వీయ గృహనిర్భంధంలో ఉంచుతూ వలంటీర్లు, ఆశ వర్కర్లను ఏర్పాటు చేసి, పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మంగళవారం నుంచి పట్టణ వీధులలో తిరుగాడే ద్విచక్రవాహనదారులకు జరిమానాలు విధించడం వెహోదలైంది.

 

 

 

పట్టణంలో ఉదయం వేళల్లో నిత్యవసర సరుకుల కొనుగోలుకు వచ్చే ప్రజలను పూర్తి స్థాయిలో పరీక్షించేందుకు రోటరీక్లబ్‌ శానిటైజింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. కాగా మండలంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు హౌస్‌హ్గల్డ్ఫీవర్‌ సర్వేలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. మండలంలో 2300 లీటర్ల సోడీయం హైపోక్లోరైడ్‌ను, 400 టన్నుల బ్లీచింగ్‌, 400 టన్నుల సున్నంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఇవే కాక గ్రామాల్లోని వాటర్‌ ట్యాంకులను శుభ్రపరచి , నీటి సరఫరాను మెరుగుపరుస్తున్నారు. 21 సచివాలయ కేంద్రాలలో వలంటీర్లకు, వైద్య సిబ్బందికి, ఆశవర్కర్లకు శానిటైజర్లు, మాస్క్లు అందజేసి , ప్రజారోగ్యాన్ని పరివేక్షించేందుకు సిద్ద పరిచారు. దీనికి తోడు మహిళా పొదుపు సంఘాలు కూడ గ్రామాలలో కుటుంభాల ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

 

 

 

 

 

ఇక పట్టణంలో ప్రజాసంచారాన్ని అదుపు చేసేందుకు పోలీస్‌, మున్సిపల్‌ , వైద్య సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల వద్ద నుంచి సహకారం లభించడం లేదు. దీంతో అవసరంగా రోడ్లపై తిరిగే వారి పట్ల మరింత కఠిన వైఖరి అవలంభించేందుకు అధికారులు సిద్దమౌతున్నారు. మంగళవారం సాయంత్రానికి కూడ పోలీసులు వాహనాలు నడుపుతున్న వారిని నిలువరించి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో పిల్లలకు ద్విచక్రవాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపుతున్న పెద్దలపై చర్యలు తీసుకునేందుకు, లైసెన్సులు రద్దు చేసేందుకు సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభమైయ్యాయి. పట్టణంలోని అన్ని ప్రధాన కూడలిలో న్యాయవాది పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌ , పి.అయూబ్‌ఖాన్‌, వి.దీపక్‌, ఎన్‌.ముత్యాలు, సివి.శ్యామ్‌ప్రసాద్‌ ల మిత్రబృందం ఆలోచన తో రెండేళ్ల నుంచి నిర్వహిస్తున్న నిత్య జాతీయ గీతాలాపన సౌండ్‌సిస్టమ్‌లు ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

 

 

 

 

వీటి ద్వారా కమిషనర్‌ లోకేశ్వర వర్మ చేస్తున్న కరోనా జగ్రత్తల ప్రకటనలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. మున్సిపల్‌, పోలీస్‌, మండల పరిషత్‌ వారి ఆధ్వర్యంలో అధికారులు, నాయకులు చేపుతున్న కార్యక్రమాలు ఇలాగే కొనసాగితే పట్టణాన్ని కరోనా రహితంగా చూసేందుకు ఎంతోకాలం పట్టదు. అధికారులకు పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు సహకరించి లాక్‌డౌన్‌కు మద్దతు ఇచ్చి ఇంట్లోనే ఉండటం ద్వారా ఈ విపత్తును అధికమించ వచ్చునని మేదావులు పేర్కొంటున్నారు.

బియ్యం పంపిణీ చేసిన యు టి ఎఫ్ నాయకురాలు హేమలత

Tags: 60 thousand people in the care of the authorities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *