ఛత్తీస్‌గఢ్‌లో62 మంది మావోయిస్టులు లొంగుబాటు

-కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుండి తప్పుకున్న గణపతి?

Date:06/11/2018

నారాయణ్‌పూర్ ముచ్చట్లు:

అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఛత్తీస్‌గఢ్‌లో62 మంది మావోయిస్టులు ఓకేసారి లొంగిపోయారు. బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వివేకానంద సిన్హా,నారాయణపూర్ ఎస్‌పీ జితేంద్ర శుక్లా సమక్షంలో మంగళవారం వీరు లొంగిపోయారు. వీరిలో51 మంది ఆయుధాలతో సహా లొంగిపోగా, స్టాండింగ్ వారెంట్లు ఉన్నవారు ఐదు మందికి పైగా ఉన్నారు. లొంగిపోయిన వారంతా గత ఎనిమిది, తొమ్మిదేళ్లుగా కుతుల్ ఏరియా కమిటీ మావోయిస్టుల నేతృత్వంలోని తుమెరడి జన్‌తన సర్కార్‌లో చురుకుగా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సోనెపూర్ క్యాంప్ ఏర్పాటు, నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లతో నక్సల్స్ కదలికలు తగ్గుముఖం పట్టినట్టు చెప్పారు. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లు, ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టులు లొంగిపోవడంతో సంస్థ బలహీనమైనట్టు లొంగిపోయిన నక్సల్ చెబుతున్నారు.కాగా వోయిస్టు పార్టీలో కీలకమార్పులు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి పదవీ బాధ్యతలు నిర్వహించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతిని ఆ పదవి నుంచి తొలగాలని పోలిట్‌ బ్యూరో సభ్యులు అడిగినట్లు సమాచారం ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంపై బాధ్యత వహిస్తున్నానని, తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు కూడా గణపతి ప్రకటించినట్లు తెలుస్తుంది.గణపతి స్థానంలో నంబాలా కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిసింది. నంబాలా కేశరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియోనిపేట. వరంగల్‌ ఆర్‌ఈసీలో కేశవరావు ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. 28 సంవత్సరాలుగా కేశవరావు అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1980 జనవరి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. 2005లోనే కేశవరావుపై రూ.50 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. వయోభారంతోనే పార్టీ బాధ్యతలను, తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీని కూడా గణపతి, పార్టీకి అప్పగించినట్లు సమాచారం.

అభివృద్ధి చేస్తారని అధికారం ఇస్తే.. అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారు

Tags:62 Maoists surrender in Chhattisgarh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *