65 శాతం పెరిగిన పన్ను వసూళ్లు 

Date:06/12/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సి.బి.డి.టి)కు ఈ ఏడాది ఇంతవరకు 6.08 కోట్ల ఆదాయ పన్ను రిటర్నులు అందాయి. ఇది గత ఏడాది కన్నా 50 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తోందని సి.బి.డి.టి చైర్మన్ సుశీల్ చంద్ర రాజధానిలో సి.ఐ.ఐ నిర్వహించిన అంతర్జాతీయ పన్ను సమావేశంలో వెల్లడించారు. కార్పొరేట్ పన్ను రిటర్నులు కూడా నిశితమైన పెరుగుదలను చూసి 8 లక్షలను తాకాయి. గత నాలుగేళ్ళలో దాఖలైన ఆదాయ పన్ను రిటర్నుల సంఖ్య 65 శాతం పెరిగిందని చంద్ర చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను సాధించడం సాధ్యవేునని తాను ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు చంద్ర చెప్పారు. నేటి వరకు ఒనగూడిన మొత్తం ప్రత్యక్ష పన్నులు బడ్జెట్ అంచనాలో 48 శాతం కిందకు వస్తాయని ఆయన తెలిపారు. ‘‘గత ఏడాది కూడా ఇదే సమయానికి మేం 48 శాతం సాధించాం. అడ్వాన్సు పన్ను వాయిదాలు మరో రెండు రావలసి ఉన్నాయి. కనుక, బడ్జెట్ అంచనాను సాధించలేకపోవడానికి నాకు కారణం కనిపించడం లేదు’’ అని చంద్ర అన్నారు. అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ (ఏ.పి.ఏ) కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచుకునేందుకు ఇండియా సిద్ధంగా ఉందని కూడా ఆయన చెప్పారు. ఇండియా ఇంతవరకు 245 ఏ.పి.ఏలు కుదుర్చుకుంది. ఫలితంగా, ఏ.పి.ఏపై సంతకం చేసిన ప్రతి బహుళజాతి పక్షానికి తొమ్మిదేళ్ళపాటు  పన్ను స్థిరత్వం సమకూరుతోందని ఆయన తెలిపారు.
Tags:65 percent increase tax collection

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *