65 సీట్లను 600 కోట్లకు అమ్ముకున్నారు-రేవంత్ రెడ్డిపై ఆరోపణ
హైదరాబాద్ ముచ్చట్లు:
10 కోట్లు నగదు, 5 ఎకరాల భూమికి గద్వాల్ టికెట్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద టీపీసీసీ సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్అందోళనకు దిగారు. నాడు ఓటుకు నోటు , నేడు సీటుకు నోటు అంటూ నినాదాలు చేసారు. 65 సీట్లను 600 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్షచూపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా… పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కేటాయించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానష్టపోతోంది. వెంటనే రేవంత్ రెడ్డి ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ కు డిమాండ్ చేసారు. రేవంత్ రెడ్డి అక్రమాలపై ఈడీ , ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామనిఅన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి లిస్ట్ ను ప్రక్షాళన చేయాలి. రేవంత్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని అయన అన్నారు.
Tags: 65 seats were sold for 600 crores – accusation against Revanth Reddy

