ఒకే ఫ్యామిలీలో 66 ఓట్లు

Date:11/05/2019
లక్నో ముచ్చట్లు:
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లోని బహ్రెచా గ్రామం. ఆ గ్రామంలోని ఓ కుటుంబంలో 66 ఓట్లు ఉన్నాయి. ఆ కుటుంబం మొత్తం సంఖ్య వచ్చేసి 82 మంది. ఈ 66 మంది ఓటర్లు ఆరో విడుతలో భాగంగా ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ కుటుంబ పెద్ద రామ్‌ నరేశ్‌ భూర్టియా వయసు 98 ఏండ్లు.  నా కుటుంబం గురించి చెప్తుంటే గర్వంగా ఉంటుంది. ఇంత మందికి ఒకటే కిచెన్‌ ఉంది. రోజుకు 20 కేజీల కూరగాయాలు, 15 కేజీల బియ్యాన్ని వండుతాం. 10 కేజీల గోధుమ పిండితో రొట్టెలు చేస్తాం. వంట పని మొత్తం మహిళలే చూసుకుంటారు. ఇక మాది వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబం. అయితే ఇద్దరు మాత్రం ముంబైలోని ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. కలిసికట్టుగా ఉంటున్న నా కుటుంబాన్ని చూస్తే సంతోషంగా ఉంటుంది.
దేశం కూడా ఇలాగే కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక తొలిసారిగా 8 మంది ఓటేయబోతున్నారు. కొత్తగా ఓటేస్తున్న 8 మంది ముని మనువలు, మనుమరాండ్లు. మా కుటుంబ ఓట్లన్నీ ఒకే పోలింగ్‌ బూత్‌లో ఉన్నాయి. అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాతే ఓటేస్తాం. ఇది ఎప్పట్నుంచో కొనసాగుతున్న ఆనవాయితీ. మేమంతా పూరీ గుడిసెలోనే నివాసముంటున్నాం. ఇల్లు కట్టుకుందామంటే తమ స్థలం పైనుంచి హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు వెళ్లాయి. దీంతో ఇల్లు కట్టుకోవడం సమస్యగా మారింది. ఎన్నికలు వచ్చినప్పుడు మా సమస్యను ఆయా పార్టీల అభ్యర్థులకు విన్నవించినప్పుడు.. సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇస్తారు. కానీ ఎన్నికలు అయిపోగానే ఆ హామీలను గాలికొదిలేస్తారు. విద్యుత్‌ అధికారులకు ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయా పార్టీల అభ్యర్థులకు సమస్యను వివరించాం. కచ్చితంగా హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు అయిపోయాక మా సమస్యను పరిష్కరించకపోతే.. సమస్యను పరిష్కారించాకే ఓటేస్తాం అని రామ్‌ నరేశ్‌ చెప్పారు.
Tags: 66 votes in single family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *