Natyam ad

7 మంది అరెస్టు ,10 లక్షల విలువగా 10 వేల కర్నాటక టెట్రా ప్యాక్కెట్లు ,ఒక కారు, ఒక మోటార్ సైకల్ స్వాదీనం

గంగవరం ముచ్చట్లు:

గంగవరం నందు 10 లక్షల విలువగా 10 వేల కర్నాటక టెట్రా ప్యాక్కెట్లు, అశోక్ లేలాండ్ వాహనం, ఒక కారు, ఒక మోటార్ సైకల్ స్వాదీనం మరియు 7 మంది అరెస్టు .   22  వ తేదీ,  చిత్తూరు జిల్లా SP Y. రిశాంత్ రెడ్డి  ఆదేశాల మేరకు, పలమనేరు సబ్ డివిజన్ పోలీసు ఆఫీసర్  N.సుధాకర్ రెడ్డి  కి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మరియు స్వీయ పర్యవేక్షణ లో, పలమనేరు రూరల్ CI  B.అశోక్ కుమార్, గంగవరం పి.యస్., SI పి.వి.సుధాకర్ రెడ్డి, మరియు ID పార్టీ సిబ్బంది నిర్వహించిన తనిఖీలో కర్నాటక రాష్ట్రం నుండి మద్యం అక్రముగా రవాణా అవుతుండగా పట్టుకోవడమైనది.22. వ తేదీ తెల్లవారి జమునా 9.00 AM గం., లకు, గంగవరం మండలం, గండ్రాజుపల్లి చెక్ పోస్ట్ వద్ద, బెంగళూరు – చెన్నై NH రోడ్డు లో వాహనములు తనిఖీ చేయుచుండగా కర్నాటక రాష్ట్రం కోలార్ వైపు నుండి ఒక మోటార్ సైకల్, కారు వాటికి కొద్ది దూరం లో ఒక అశోక్ లేలాండ్ దోస్త్ లగేజ్ వాహనం వస్తూ ఉండి, అనుమానం తో వాటిని తనిఖీ చేయగా వాటిలో కర్నాటక మద్యం అట్ట బాక్స్ లు ఉండినవి. అంతట విచారించగా చిత్తూరు, మిట్టూర్ కు చెందిన ఉన్నిక్రిష్ణ s/o సుకుమార్ అను అతను తన స్నేహితులతో కలసి గత కొంత కాలంగా కర్నాటక రాష్ట్రం నుండి మద్యం ప్యాక్కెట్లు కొని వాటిని ఎవరికి అనుమానం రాకుండా కొరియర్ వాహనం నందు ఆంధ్రకు రవాణా చేసి ఎక్కువ ధరకు అమ్మి సులభ మార్గం లో డబ్బు సంపాదించేవారని,

 

 

Post Midle

అలాగే ఈ దినం 22.11.2022 ఉదయం తనకు పరిచయం ఉన్న విక్టర్ జ్ఞానశేఖర్ అశోక్ లేలాండ్ దోస్త్ లగేజ్ వాహనం (కొరియర్ వాహనం) TN 20 DA 7772 నందు కర్నాటక రాష్ట్రం కోలార్ సమీపం లో ఒక పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా 10,000 టెట్రా ప్యాక్కెట్లు లను కొనుగోలు చేసి, వాటిని వారి వాహనములలో లోడ్ చేసి, ముందర పోలీసు వారి మూమెంట్ చూడడానికి ఉన్నిక్రిష్ణ మరియు అతని స్నేహితులు లక్ష్మణ్, జయ ప్రకాష్ మరియు శ్యామ్ లు ఉన్ని క్రిష్ణ యొక్క కారు నంబర్ AP07 AG 4355 నందు 10 మద్యం అట్ట బాక్స్ లు పెట్టుకొని, క్రాంతి కుమార్ మరియూ గణేశ్ అను వారు స్కూటి మోటార్ సైకల్ లో 02 మద్యం అట్ట బాక్స్ లు పెట్టుకొని పైలట్ గా వస్తు, మిగతా మద్యం బాక్స్ లు కొరియర్ వాహనం నందు వస్తూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కు అక్రమ రవాణా చేయుచు పట్టుబడడం జరిగింది. అంతట మద్యం సుమారు 10,000 టెట్రా ప్యాక్కెట్లు, వీటి విలువ సుమారు రూ. 10,00,000/-, రవాణా చేస్తున్న అశోక్ లేలాండ్ వాహనం, పైలట్ వాహనములు ఒక మోటార్ సైకల్ మరియు కారు ను సీజ్ చేసి పై 07 మంది వ్యక్తులను అరెస్టు చేసి మద్యంను స్వాదీనం చేసుకోవడమైనది. కర్నాటక మద్యం షాప్ ల నుండి సరఫరా చేయు వ్యక్తుల కోసం గాలింపు జరుగు చున్నది, వారిని త్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది. చిత్తూరు టౌన్ కు చెందిన చాలా మంది వ్యక్తులు అక్రమ మద్యం వ్యాపారం చేయుచున్నారు. వారి మీద కూడా నిఘా ఉంచడమైనది.

• TOPSTAR BRANDY 180 Ml & 90 Ml, 80 cart boxes,
• Old Secret XXX Rum 90 Ml, 20 cart boxes,
• పట్టుబడిన మొత్తం మద్యం విలువ :- రూ 10,00,000/-
• పట్టుబడిన 03 వాహనముల విలువ :- రూ 15,00,000/-

 

అక్రమ మద్యం రవాణా చేయుచున్న వాహనము మరియు పైలట్ వాహనములు
1. Ashok Leyland Dost bearing regn no. TN 20 DA 772,
2. Santro Car bearing regn no. AP 07 AG 4355
3. Scooty motor cycle Number not known
ముద్దాయిల వివరములు

1. Unnikumar, aged 38 yrs, s/o S.R.Sukumar, r/o ASM Street, Mittoor, Chittoor,

2. S.Lakshman, aged 32 yrs, s/o S.Vivekananda, r/o CKM Street, Mittoor, Chittoor,

3. S.Jaya Prakash, aged 22 yrs, s/o S.Vivekananda, r/o CKM Street, Mittoor, Chittoor.

4. Victor Gnanasekhar, aged 42 yrs, s/o M.Soundarrajan,

5. M.Syam Dikky, aged 38 yrs, s/o Munaswamy, r/o MM Koil street, high road, Chittoor,

6. T.N.Kranti Kumar, aged 33 yrs, s/o T Nataraj, r/o Jailkhan Street, Mittoor, Chittoor,

7. S.Ganesh, aged 38 yrs, s/o S.Siva, r/o III gate, Chittoor

Tags:7 people arrested, 10 thousand Karnataka tetra packets worth 10 lakhs, one car, one motorcycle seized

Post Midle

Leave A Reply

Your email address will not be published.