పోలీసులపై దాడి కేసులో 7 మంది అరెస్ట్
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరులో ఆగస్టు 4న చంద్రబాబు పర్యటనలో పోలీసులపై దాడి చేసిన కేసులో 7 మందిని సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న వనమలదిన్నెకు చెందిన మధుకుమార్, మునెప్ప, రాజేంద్ర లను సీఐ రాఘవరెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే పట్టణానికి చెందిన సయ్యద్, ప్రసాద్, సోమల మండలానికి చెందిన మునిరాజ, సుగాలిమిట్టకు చెందిన రూపేంద్రనాయక్ లను కూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags: 7 people were arrested in the case of attack on police
