పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీకి చేందిన 70 మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం మండలంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధం ఎన్నికల ప్రచారాన్ని జెడ్పి చైర్మెన్ శ్రీనివాసులు తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా మేలుందొడ్డి, గోపిశెట్టిపల్లెకు చెందిన పలువురు వెంకటప్ప ఆధ్వర్యంలో సుమారు 30 మంది పార్టీలో చేరారు. అలాగే సింగిరిగుంటలో శివ, రెడ్డెప్ప, హరికృష్ణ, చిరంజీవి, చంద్ర తో కలసి 15 మంది పార్టీలో చేరారు. అలాగే కుమ్మరగుంట గ్రామానికి చెందిన శీనప్ప, సుబ్రమణి, మునిరాజు, చిన్నరెడ్డెప్ప,గట్టప్ప, మునిరాజప్ప, బాలాజిలు తో పాటు 25 మంది పార్టీలో చేరారు. సుమారు 70 మంది పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి పెద్దిరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్ ఆర్టీసి మజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కొత్తపల్లి చెంగారెడ్డి, సచివాలయాల కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags; 70 people migrated to YSRCP in the presence of Minister Peddireddy