-జిల్లా కలెక్టర్ జి. రవి
Date:26/11/2020
జగిత్యాల ముచ్చట్లు:
71వ భారత రాజ్యాంగ దినోత్సవ కార్యాక్రమాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రవి పాల్గోన్నారు. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్రం అవతరించిన తరువాత, భారత దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ స్వేచ్ఛా, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, వంటి అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించి, డా. బి. ఆర్. అంబేడ్కర్ గారిని చైర్మన్గా పండిత్ గోవింద్ వల్లబ్ పంత్, కె.ఎం. మున్నీ, అల్లాడి కృష్ణ, స్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి, అయ్యంగార్, బీఎల్. మిట్టర్, ఎమ్డీ. సాదుల్లా, డి.పి. ఖైతావ్, ఖైతావ్ మరణానంతరం టీటీ. కృష్ణమాచారిల పర్యవేక్షణలో రెండు సంవత్సరాల 11నెలల 18 రోజులు కష్టపడి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసి 26నవంబర్ 1949 నాడు తుది రాజ్యాంగాన్ని ఆమోదించబడి, జనవరి 26, 1950 నుండి 315 అధికరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలతో రాజ్యాంగం అమలులోకి వచ్చిందని పేర్కోన్నారు. భారత ప్రభుత్వం 2015లో అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. రాజ్యాంగ దినోత్సవాన్నీ సంవిదాన్ దివస్ అనికూడా అంటారని పేర్కోన్నారు. అప్పటి నుంచి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా, రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రస్తుతం రాజ్యాంగంలో 448 అధికరణలు, 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు ఉన్నాయని, ఇప్పటి వరకు 104 సవరణలు జరిగాయని పేర్కోన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్యాలయ సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలోని ఇతర కార్యాలయాలలో కూడా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడిస్ అరుణశ్రీ, కార్యాలయ ఏఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ వకిల్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: 71 years to the Constitution of India