793 corona positive cases in AP in last 24 hours

గత 24 గంటల్లో ఏపి లో 793 కరోనా పాజిటివ్ కేసులు

Date:29/06/2020

అమరావతి ముచ్చట్లు:

ఏపీలోని కరోనా కేసుల బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. గత 24 గంటల్లో 793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏపీకి చెందిన వారు 708 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 81 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు ఆరుగురు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి 30,216 శాంపిల్స్ పరీక్షించగా 706 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 302 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 11 మంది మృతి చెందారు. కర్నూల్‌లో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు.ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,72,076 శాంపిల్స్ పరీక్షించారు. మొత్తం కేసులు 13,891 నమోదుకాగా, 7479 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 6232 మంది డిశ్చార్జ్ అయ్యారు.  కోవిడ్ కారణంగా 180 మంది చనిపోయారు.

స్మశానవాటికల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

Tags: 793 corona positive cases in AP in last 24 hours

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *