Date:05/12/2020
తిరుమల ముచ్చట్లు:
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని వసంత మండపంలో డిసెంబరు 6వ తేదీ 7వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. తిరుమలలో వర్షం కారణంగా నాదనీరాజనం వేదికపై కాకుండా వసంత మండపంలో ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. కావున ఈ మార్పును భక్తులు గమనించగలరు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 25వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న 194 శ్లోకాలను పారాయణం చేస్తారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
జాంభి రెడ్డి” టీజర్ అదిరిపోయింది.. నాకు బాగా నచ్చింది.. సమంత !!
Tags: 7th installment Sundarakanda Akhanda Parayanam on 6th Vasantha Mandapam