ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 8 మందికి స్వల్ప గాయాలు

Date:18/01/2020

మదనపల్లి ముచ్చట్లు:

చిన్నగొట్టిగల్లు మండలం ఎడం వారి పల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి సమీప పొలాల్లోని చెట్లలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 8 మంది కి స్వల్ప గాయాలైన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది . పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి నుండి మదనపల్లి కి వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిన్నగొట్టిగల్లు మండలం ఎడం వారిపల్లె సమీపంలో కి రాగానే బస్సు ముందు టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లింది . దీంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చిన్నగొట్టిగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు రూరల్ సీఐ మురళీకృష్ణ పేర్కొన్నారు.

 

రైతులందరికి విరివిగా రుణాలు మంజూరు

Tags: 8 injured in RTC bus accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *