పుంగనూరు దొంగతనం కేసులో 8 నెలల జైలుశిక్ష
పుంగనూరు ముచ్చట్లు:
రెండు ఇండ్ల దొంగతనాల కేసులలో నిందితుడు రామచంద్రాప్ప, అనే రామచారికి 8 నెలల జైలుశిక్ష, రూ.1000లు జరిమాన విధిస్తూ అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి సిందు తీర్పు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రెండు ఇండ్లలో రాత్రిపూట తలుపులు తాళాలు పగులగొట్టి నిందితుడు రామచంద్రప్ప నగలు, వస్తువులు చోరీ చేసుకెళ్లాడు. దీనిపై అప్పటి ఎస్‌ఐ మోహన్‌కుమార్ కేసు నమోదు చేసి, నిందితుడి వద్ద వస్తువులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ రామకృష్ణ కేసులో నిందితుడి పాత్రను పూర్తి స్థాయిలో కోర్టుకు రుజువు చేసి, ఇందుకు తగ్గ సాక్షాలను హాజరుపరిచారు. వాదప్రతివాదనలు విన్న న్యాయమూర్తి సిందు ప్రాక్యూషిన్ వాదనలతో ఏకీభవించి నిందితుడికి 8 నెలల జైలుశిక్ష, రూ.1000లు జరిమాన విధించారు. నిందితుడిని జైలుకు తరలించారు.

Tags: 8 months imprisonment in Punganur theft case
