Natyam ad

రోడ్డు ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలు

గిద్దలూరు ముచ్చట్లు:
 
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వివేకానంద కాలనీ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి పై కారు, బొలెరో వాహనం ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు 108 వాహనంలో గాయపడ్డ వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బొలెరో వాహనంలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నారు. వీరందరూ కర్నూలు జిల్లా డోన్ నుంచి గుంటూరు కు మిరపకాయ కోతలకు వెళ్తున్న వలస కూలీలు గా పోలీసులు గుర్తించారు.జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: 8 workers injured in road accident