ఏపీలో 86 రసాయన పరిశ్రమలు

Date:09/05/2020

విజయవాడ ముచ్చట్లు:

విశాఖ ఎల్జీ పాలిమర్స్ విష వాయువు దుర్ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రమాదకర పరిశ్రమలకు సంబంధించిన వివరాల్ని సేకరించింది. ప్రమాదం జరగటానికి ఆస్కారం ఉన్న పరిశ్రమలు రాష్ట్రంలో 86 ఉన్నాయని పరిశ్రమల శాఖ గుర్తించిందొ. జిల్లాల వారీగా జాబితా సిద్ధం చేశారు అధికారులు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో భద్రతా ప్రమాణాలు పరిశీలించాకే పునఃప్రారంభం విషయంలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఆయా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అధికారులు స్వయంగా పరిశీలించిన తర్వాతే పునఃప్రారంభానికి అనుమతించనున్నారు.విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో దుర్ఘటన తర్వాత అప్రమత్తం అయిన అధికారులు ఈ జాబితాను రూపొందించారు.

 

 

 

 

ప్రమాదం జరగటానికి ఆస్కారం ఉన్న పరిశ్రమల జాబితాలో ఫార్మా, గ్యాస్‌, రసాయనాలు తయారు చేసే భారీ పరిశ్రమలను చేర్చారు జిల్లాల వారీగా ఆ పరిశ్రమల్లో యంత్రాలు, బాయిలర్లు, రసాయనాలు నిల్వ చేసే ట్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు పరిశీలించి, రెండు రోజుల్లో నివేదిక పంపాలని పరిశ్రమల శాఖ ఆదేశించింది. కంపెనీ భద్రతా విభాగం అధికారులతో కలిసి పరిశ్రమల శాఖ, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, పోలీసుశాఖ తరఫున సభ్యులు వెళ్లి తనిఖీలు ప్రారంభించారు. వీరు పరిశ్రమల యాజమాన్యం నుంచి భద్రతా ప్రమాణాలు పాటించినట్లు కచ్చితమైన హామీ పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుందిరెండు రోజుల్లో పరిశీలన పూర్తి చేయాలని ఆయా జిల్లాల అధికారుల్ని పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం ఆదేశించారు.

 

 

 

 

భారీ పరిశ్రమల భద్రతా ప్రమాణాలు పరిశీలించాకే పునఃప్రారంభానికి అనుమతించాలన్నారు. జిల్లాల వారీగా చూస్తే… తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 21 ప్రమాదకర పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ ఎప్పటికప్పుడు మనం గ్యాస్ లీకేజీ వార్తలు వింటూనే ఉంటుంటాం. ఆ తర్వాత విశాఖలోనే అత్యధికంగా 20 పరిశ్రమలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 10, కృష్ణా జిల్లాలో 9ఉన్నాయి. చిత్తూరు, కర్నూలులో 5, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో 4, కడప, ప్రకాశం జిల్లాలో 3, నెల్లూరులో 2 ప్రమాదకర పరిశ్రమలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఢిల్లీలో కరోనా రాజకీయాలు

Tags: 86 chemical industries in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *