88.52 కోట్ల చేప పిల్లలు 

హైదరాబాద్ ముచ్చట్లు:


చేపా..చేపా.. చెరువుకు ఎందుకు వెళ్లలే అంటే.. నిధులు లేక మమ్మల్ని వదలట్లేదు’ అని చెబుతున్నాయి చేపపిల్లలు. రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి నిధుల కొరత ఏర్పడింది. దీంతో ఆగష్టు మొదటి వారంలోనే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేయాల్సి ఉన్నా.. నిధులు లేక మత్స్యశాఖ విడుదల చేయలేకపోతుంది. నిధుల కోసం శాఖ కమిషనర్ మంత్రికి తెలిపినా.. నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండడంతో విడుదలలో జాప్యం జరుగుతోంది. ఇదిలా ఉండగా మత్స్య శాఖకు గతంలో నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ విడుదల చేసిన నిధుల్లో రూ.50 కోట్లు ఉన్నప్పటికీ.. సర్కారు వాటికి కూడా క్లియరెన్స్ ఇవ్వడం లేదు. ఇప్పటికే ఉన్న రూ.50 కోట్లతో పాటు మరో రూ.50 కోట్లు అవసరం పడుతుండగా.. ఇప్పటివరకు ఒక్క రూపాయిని విడుదల చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్ధిక స్థితిగతులే ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఎన్ సిడిసి నుంచి కొంతమేర రుణాన్ని తీసుకోవాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం.2022–23 ఏడాదికి గాను రాష్ట్రవ్యాప్తంగా 26,778 నీటి వనరుల్లో 88.52 కోట్ల చేపపిల్లలను, 10 కోట్ల రొయ్య పిల్లలను వదలాలని మత్స్యశాఖ కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం సుమారు రూ.100 కోట్లు అవసరం పడుతాయని అధికారులు ప్రతిపాదించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అవసరమైన పైసలకు మాత్రం ఫైనాన్షియల్ డిపార్ట్ మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

 

 

దీంతో సమయానికి చేప, రొయ్య పిల్లలను వదలకపోవడంతో చేపలు, రొయ్యలు ఆశించిన మేర ఎదగలేకపోతున్నాయని, కొన్ని చనిపోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వదలుతున్న చేప, రొయ్య పిల్లలు ప్రభుత్వం సూచించిన సైజుల్లో ఉండడంలేదని కూడా ఆరోపిస్తున్నారు.ఏడాది చేప పిల్లల పంపిణీకి సంబంధించి విడుదల జాప్యంలో టెండర్ల ప్రక్రియ కూడా ఒకింత కారణమని తెలుస్తోంది. ఈ మేరకు 2022–23 ఏడాది కోసం మత్స్య శాఖ టెండర్లను ఆహ్వానించగా.. రాష్ట్రవ్యాప్తంగా 200 వరకు టెండర్లు దాఖలయ్యాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా.. జరిగిన టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కాంట్రాక్టర్లు నకిలీ షూరిటీ బాండ్ పేపర్లను సమర్పించారని తేలినట్టు సమాచారం. దీంతో టెండర్ ప్రక్రియపై అధికారులు చర్చిస్తున్నారు. అయితే నకిలీ బాండ్లను ఇచ్చిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటారా? లేదంటే మరోసారి టెండర్ ప్రక్రియను చేపడతారా? అన్న అంశంపై సందిగ్ధత ఏర్పడింది.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ టెండర్లలో గోల్ మాల్ జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. ఆ టెండర్లన్నింటిని రద్దు చేసి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ చేయాలి. గోల్ మాల్ చేసిన టెండర్ దారులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

 

Tags: 88.52 crore fish fry

Leave A Reply

Your email address will not be published.