Natyam ad

9చైతన్య భారతి కాలేజీలో ఎయిడ్స్ అవగాహన సదస్సు

ఏలూరు ముచ్చట్లు:


ప్రపంచ హెచ్ఐవి /ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లా చింతలపూడి లోని చైతన్య భారతి జూనియర్ కళాశాల  లో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి  ఇబ్రహీం షరీఫ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు హెచ్ఐవి,  ఎయిడ్స్ రోగాల పట్ల   అవగాహన కలిగి ఉండాలని అని అన్నారు. విద్యార్థులు భారత రాజ్యాంగంలోని హక్కులు విధులు గురించి అవగాహన కలిగి ఉండాలని అని అన్నారు. చింతలపూడి ఏరియా హాస్పిటల్ ఎయిడ్స్ కౌన్సిలర్ నిమ్మగడ్డ. అశోక్ మాట్లాడుతూ  ఏయిడ్స్ రావడానికి కారణం ముఖ్యంగా అక్రమ సంబంధాలే నని కేవలం ఎయిడ్స్ రోగం పట్ల అవగాహన లేక  ఎంతో మంది బలవుతున్నారు అని,  సమాజంలో ఎయిడ్స్ బాధితులను చులకనగా చూడరాదని అలా ఎవరైనా బాధితుల పై వివక్ష చూపితే శిక్ష కు అర్హులని,  పిల్లలు ప్రేమలు, పెళ్ళిళ్ళు అని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, చదువులో శ్రద్ద పెట్టీ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని అని అన్నారు. ఈ కార్యక్రమము  లో స్కూల్ చైర్మన్  బొడా. రవి, కాలేజ్ ప్రిన్సిపాల్ G. ప్రసన్న కుమార్,  న్యాయవాదులు  మీసాల.రమేష్, సోషల్ వర్కర్  ఎండీ అక్బర్ అలీ స్టాఫ్, విద్యార్థులు  పాల్గొన్నారు.

 

Tags: 9 AIDS Awareness Seminar at Chaitanya Bharti College

Post Midle
Post Midle