నంద్యాల ముచ్చట్లు:
తరగతి గది పైకప్పు కూలి నంద్యాల లోని బడిలో 9 మంది విద్యార్థినుల కు గాయాలు అయ్యాయి.తరగతి గదిలో 30 మంది విద్యార్థినుల కు పాఠం బోధిస్తుండగా హఠాత్తుగా పైకప్పు కూలిన ఘటన నంద్యాల పట్టణంలోని శ్రీ సంకల్ప్ పాఠశాలలో సోమవారం జరిగింది. పైకప్పు నేరుగా బాలికల మీద పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.కాంక్రీటు శిధిలాలు తగిలి 9 మంది విద్యార్థినులు, సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు విద్యార్థినులకు తలపై గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు.
Tags: 9 female students were injured when the roof of the classroom collapsed