4వ రోజు 9 మంది ఎమ్మెల్యేల సస్పెండ్

Date:03/12/2020

విజయవాడ ముచ్చట్లు:

పింఛన్ల వ్యవహారంపై సభలో మాటల యుద్ధం జరిగింది. పింఛన్ల వ్యవహారంపై సభ దద్దరిల్లింది.. ప్రతిపక్ష పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.3000 పెన్షన్ ఇస్తామన్నారు.. అసలేమైంది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎంత పెన్షన్‌ ఎంత అన్నది రాష్ట్రంలో ఎవ్వరిని అడిగినా చెబుతారని సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు.సభలో చర్చ సందర్భంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న టీడీపీ సభ్యుడు రామానాయుడుపై సీఎం జగన్‌ మండిపడ్డారు. ఆయన రామానాయుడు కాదు. డ్రామానాయుడని ఎద్దేవా చేశారు. అన్నీ అబద్ధాలు చెబుతూ.. ఉద్దేశపూర్వకంగా సభను తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం కోరుతుమన్నారు. ఆ తర్వాత సభా నాయకుడి సూచన మేరకు టీడీపీ సభ్యుడు రామానాయుడిపై సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి చర్యలు కొనసాగుతాయని స్పీకర్‌ తెలిపారు.ఈ క్రమంలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. 8మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెండ్ అయిన టీడీపీ సభ్యుల్లో అచ్చెన్నాయడు, రామకృష్ణబాబు, మంతెన రామరాజు, సత్యప్రసాద్, వీరాంజనేయులు, బెందాళం అశోక్, జోగేశ్వరరావు ఉన్నారు.

పుంగనూరు ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Tags: 9 MLAs suspended on 4th day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *