పుంగనూరులో రైతులకు 90 శాతం బ్యాంకు రుణాలు – ఏడి కోటేశ్వరరావు

పుంగనూరు ముచ్చట్లు:
 
రైతులను అభివృద్ధి పరిచేందుకు 90 శాతం బ్యాంకు రుణాలతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉధ్యానవనశాఖా ఏడి కోటేశ్వరరావు తెలిపారు. శనివార ం సాయంత్రం ఆయన మండలంలోని చండ్రమాకులపల్లెలో హెచ్‌వో లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో ఆర్‌బికె లో రైతు సంఘాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏడి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏఐఎఫ్‌ పథకం క్రింద పండ్లు, కూరగాయలు కొనుగోలు కేంద్రాలు , శీతలగిడ్డంగులను 75 శాతం రాయితీతో , 90 శాతం బ్యాంకు రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను రైతులకు 3 శాతం తక్కువ వడ్డితో సంఘాలకు రుణాలు అందించనున్నట్లు తెలిపారు. పండ్లు, కూరగాయలు సేకరించే కేంద్రాలకు రూ.15 లక్షలు, శీతలగిడ్డంగులకు సోలారు లేదా సాధారణ గిడ్డంగులకు రూ.10 లక్షలు యూనిట్‌కాస్ట్గా నిర్ణయించినట్లు తెలిపారు. వీటిని రైతులు వినియోగించుకోవాలన్నారు. అలాగే ఆర్‌బికెల ద్వారా ఎరువులు, విత్తనాలు , పురుగుల మందు సకాలంలో అందించి , రైతులకు తగిన అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ఎటువంటి అవసరమున్న ఉధ్యానవనశాఖ ద్వారా తగిన సలహాలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ వేమారెడ్డి, ఆర్‌బికె సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
 
Tags; 90% bank loans to farmers in Punganur – Adi Koteshwara Rao

Leave A Reply

Your email address will not be published.