ఐదు కోట్లకు 90 కోట్లు…

చెన్నై ముచ్చట్లు:

చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో దుమ్మురేపుతున్నాయి. ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా సినిమాలు రిలీజ్ అయ్యి సంచలన విజయాలు అందుకుంటున్నాయి. ఊహించని విధంగా కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఇలా వచ్చి భారీ విజయాలను అందుకుంటున్నాయి. వాటిలో బైపన్ భారీ దేవ మూవీ ఒకటి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బడ్జెట్ చాలా తక్కువ కానీ సాధించిన కలెక్షన్స్ మాత్రం సాలిడ్. ఓటీటీలోకి చాలా సినిమాలు వస్తుంటాయి. కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. తాజాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయ్యింది.మరాఠీ భాషలో తెరకెక్కిన బైపన్ భారీ దేవ మూవీ ఘన విజయం అందుకుంది. ఈ సినిమా కేవలం 5 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కింది. కలెక్షన్స్ మాత్రం భారీగా వసూల్ చేసింది.

 

 

బైపన్ భారీ దేవ మూవీ 50 రోజుల థియేట్రికల్ రన్‌లో ఏకంగా రూ. 90.5 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరాఠీ లో సైరాట్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఇప్పటి వరకు ఆ సినిమానే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.ఆ సినిమా తర్వాత ఇప్పుడు బైపన్ భారీ దేవ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. బైపన్ భారీ దేవ మూవీ థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని బైపన్ భారీ దేవ సినిమాను రెండు ఓటీటీల్లో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ , హులు యాప్ లో బైపన్ భారీ దేవ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. గతేడాది జూన్ 30న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో ఆసక్తికరంగా మారింది.

 

Tags: 90 crores for five crores…

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *