Natyam ad

రఘునందన్ రావుకు 90 శాతం భూమినిస్తా..

తోట చంద్రశేఖర్

విజయవాడ ముచ్చట్లు:


తనపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కొట్టిపారేసారు. చిల్లర రాజకీయాల కోసమే నిరాధార, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభ నుంచి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికే పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రఘునందన్ రావు చేస్తున్న ఆరోపణలు నిజమైతే… ఆ సర్వే నెంబర్ భూమిలో 90 శాతం తననే తీసుకోమని, మిగిలిన 10 శాతాన్ని నాకు ఇవ్వమని చెప్పండి. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర కీలకం కాబోతోంది. తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే…. కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రగతిని దేశానికి పరిచయం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని అన్నారు.

 

Post Midle

Tags: 90 percent land will be given to Raghunandan Rao.

Post Midle