Date:26/01/2021
దిల్లీ ముచ్చట్లు:
దేశంలో సోమవారం రోజువారీ కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్త కేసుల సంఖ్య జూన్ కనిష్ఠానికి చేరింది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..పాజిటివ్ కేసుల సంఖ్య పదివేల దిగువకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 7,25,577 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..9,102 వైరస్ కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1.06 కోట్లుగా ఉంది. అలాగే క్రియాశీల కేసులు 1,77,266కు చేరుకున్నాయి. దాంతో ఆ రేటు 1.73 శాతానికి తగ్గింది.ఇక, నిన్న కరోనా నుంచి 15,901 మంది కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు 1,03,45,985 మంది వైరస్ నుంచి బయటపడినట్లయింది. రికవరీ రేటు 96.83 శాతానికి చేరింది. ఈ మహమ్మారి కారణంగా తాజాగా 117 మరణాలు సంభవించాయి. మొత్తం మృతుల సంఖ్య 1,53,587గా ఉంది.
దేశాభివృద్ధికి యువత పునరంకితం కావాలి
Tags: 9,102 new cases in 24 hours..117 deaths