Natyam ad

పుంగనూరు జాతీయ లోక్‌అదాలత్‌లో 921 కేసులు పరిష్కారం- న్యాయమూర్తి వాసుదేవరావు

పుంగనూరు ముచ్చట్లు:

జాతీయ లోక్‌అదాలత్‌లో శనివారం 921 కేసులు పరిష్కరించినట్లు సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు తెలిపారు. ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌, అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి సిందుతో కలసి లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించారు. న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ రాష్ట్ర లీగల్‌ సర్వీసస్‌ అథారిటి ఆదేశాల మేరకు లోక్‌అదాలత్‌ నిర్వహించి, సివిల్‌ , క్రిమినల్‌ కేసులతో పాటు మనోవర్తి కేసులను పరిష్కరించామన్నారు. దీని ద్వారా రూ.1.47 కోట్ల రూపాయలను పార్టీలకు కేసులు పరిష్కరించి అందజేశామన్నారు. ప్రతి ఒక్కరు తమ కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు లోక్‌అదాలత్‌ను వేదికగా మార్చుకోవాలని సూచించారు. లోక్‌అదాలత్‌లో పరిష్కారమైయ్యే కేసులకు కోర్టు ఫీజులు వాపస్సు చేయబడుతుందన్నారు. అలాగే లోక్‌ అదాలత్‌లపై అప్పీల్‌ ఉండదని, తూదితీర్పు లోక్‌అదాలత్‌దేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్ష , కార్యదర్శులు విజయకుమార్‌, రమేష్‌బాబుతో పాటు పోలీసులు, వివిధశాఖల అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: 921 cases solved in Punganur National Lok Adalat- Judge Vasudeva Rao

Post Midle