93 people corona negative

93 మందికి కరోనా నెగిటివ్

– ఊపిరి పీల్చుకున్న పలమనేరు ప్రజ లు

– శానిటైజర్లు,మాస్కులు పంపిణీ

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరుకు సమీపంలోని మదనపల్లి రోడ్డు ప్రక్కనగల మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోరంటైన్ సెంటర్ లో ఉన్న 93 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని పలమనేరు తహసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు.వీరందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తేలడంతో వారిని పరీక్షల అనంతరం వాహనాల్లో వారిని ఇండ్లకు పంపామని ఆయన తెలిపారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు, అపోహాలు,భయాందోళన అవసరం లేదన్నారు.అలాగే కరోనా నివారణకు పోలీసులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు.స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ నాగరాజు వద్దకు మాజీ గంగమ్మగుడి చైర్మన్ అమ్ములు,డాక్టర్ మునిరాజులు వీటిని అందించారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా వీటిని అందించామని చెప్పారు.ఈ కార్యక్రమంలో నాగ,చిన్నిలు పాల్గొన్నారు. ఇలాఉండగా ముస్లిం సోదరులు జరుపుకునే షబాను పండుగ సందర్భంగా ఎటువంటి సామూహిక ప్రార్థనలు,మసీదుల లో ప్రార్థనలు చేయరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.పండుగను ముస్లిం లు ఇళ్ళవద్దే జరుపుకోవాలని ఆయన కోరారు. దయచేసి ముస్లిం ప్రజలందరూ సహకరించవలెనని కోరారు.

వర్తక వ్యాపారులచే మాస్క్ లు , శానిటైజర్లు పంపిణీ

Tags: 93 people corona negative

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *