Natyam ad

గోదాములలో మునుగుతున్న 94 లక్షల టన్నుల బియ్యం

కరీంనగర్ ముచ్చట్లు:


రాష్ట్రంలో దగ్గర ఉండిపోయిన ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించడానికి పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతున్నది. త్వరలోనే టెండర్లను ఆహ్వానించాలనుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా కొనడానికి సంసిద్ధం కాకపోవడంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ దిశగా ఆలోచిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 94 లక్షల టన్నుల ధాన్యం రెడీగా ఉన్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సురక్షితంగా దాచిపెట్టడానికి గోడౌన్లలో తగిన స్థలం లేకపోవడంతో ఆరుబైటనే పెట్టాల్సి వచ్చింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 10 లక్షల టన్నులు తడిచి ముద్దయ్యాయి. ఇంకొన్ని రోజుల్లో ఇవి ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పౌరసరఫరాల శాఖ టెండర్ల ద్వారా విక్రయించడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి ఆమోదం రాగానే తదుపరి కార్యాచరణను చేపట్టనున్నది.ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు మంత్రి గంగుల కమలాకర్‌తో గురువారం రాత్రి హైదరాబాద్‌లో చర్చించారు.

 

 

 

గత నెల 7వ తేదీ నుంచి వివిధ సాకులతో ఎఫ్‌సీఐ మిల్లింగ్ ప్రక్రియను నిలిపివేసిందని మంత్రి గంగుల కమలాకర్ ఈ సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు. రైతులు కష్టపడి పండించినా సేకరణపై బాధ్యతారాహిత్యంగా ఉన్నదని, 2020-21 యాసంగి, 2021-22 వానాకాలం, యాసంగి ధాన్యంతో కలిపి మొత్తం సుమారు 94 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉన్నట్లు ప్రకటనలో మీడియాకు వివరించారు. కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా ఎఫ్‌సీఐ అధికారులకు, కేంద్రానికి రాష్ట్ర మంత్రిగా తాను, సివిల్ సప్లయ్ శాఖ అధికారులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదన్నారు. వర్షాలతో ఇప్పటికే 10 లక్షల టన్నుల ధాన్యం తడిచి ముద్దయిందని, మరో వారం రోజుల్లో పూర్తిగా పాడైపోయే పరిస్థితులున్నాయన్నారు.మరో గత్యంతరం లేక ఈ ధాన్యాన్ని టెండర్ ద్వారా విక్రయించాలనే ప్రతిపాదనలపై తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టెండర్ల విధివిదానాలు, ఎఫ్‌సీఐ వైఖరి, రాష్ట్ర పీడీఎస్ అవసరాలపై మంత్రి ఈ సమావేశంలో మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. వీలైనంత తక్కువ నష్టంతో ఈ సమస్య నుంచి బైటపడేలా టెండర్ మార్గాన్ని ఎంచుకున్నామని, సీఎం ఆమోదం రాగానే అధికారులు అధికారులు రంగంలోకి దిగుతారని తెలిపారు.

 

Post Midle

Tags: 94 lakh tonnes of rice languishing in warehouses

Post Midle