రాష్ట్ర ప్రాజెక్టులు 95 శాతం పూర్తి

95% of state projects completed

95% of state projects completed

Date:14/09/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
శనివారం నాడు శ్రీకాకుళంలో నాగావళి నదికి తమ్మినాయుడుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి నిర్వహిస్తారు.  తరువాత అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బహిరంగ సభ వుంటుందని రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి కిమిడి కళా వెంకట్రావు వెల్లడించారు.
శుక్రవారం అయన స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  రాష్ట్రంలో రూ. 58 వేల కోట్లతో జలవనరుల ప్రాజెక్టులు చేపట్టాం. 95 శాతం పనులు పూర్తి అయ్యాయి. జిల్లాలో రూ. 8500 కోట్లతో జలవనరుల పనులు కొనసాగుతున్నాయని అయన అన్నారు.
సర్దార్  గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 250 కోట్లు విడుదల చేసి పూర్తి చేసారు. ఓల్డ్ రెగ్యులేటరీ కాలువల ఆధునీకరణకు రూ. 193 కోట్లు విడుదల చేసారని అన్నారు. చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాకు అపర భగీరధుడని కొనియాడారు.
Tags:95% of state projects completed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *