ఒక సంస్థకు 97 కోట్లు ఎట్లా ఇస్తారు ? 

97 crores for a company?

97 crores for a company?

 Date:15/09/2018
రాజమహేంద్రవరం ముచ్చట్లు:
కుటుంబరావు రమ్మంటే రెండు సార్లు వెళ్ళాను.  ఆయన అందుబాటులో లేరు. బాండ్ల జారీలో అవినీతి జరిగిందని నిరూపిస్తే  24 గంటల్లో రాజీనామా చేస్తానని కుటుంబరావు ఒకనోట్ విడుదల చేసారు. బాండ్లపై 10.36 శాతం వడ్డీ ఎందుకు ఇస్తున్నారనే నేను ప్రశ్నించాను. ఎప్పుడైనా సరే రండి. మీకు ఏ వివరాలు కావాలన్నా ఇస్తానని కుటుంబరావు ఆఫర్ ఇచ్చారు. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాను. ప్రభుత్వం తరపున ఆయన సమాధానాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
శనివారం అయన మీడియాతో మాట్లాడారు. నేను రాజకీయ ఆరోపణలు చెయ్యను.   ఆడిట్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగానే నేను మాట్లాడతాను. హైకోర్టు భవనాల నిర్మాణానికి ఇచ్చిన కాట్రాక్ట్ లలో 95 కోట్ల కాంట్రాక్ట్ లో రద్దుచేసిన కాంట్రాక్టర్ కి 1.15 కోట్లు ఎలా ఇచ్చారని అయన ప్రశ్నించారు. 97 కోట్లు ఒక  సంస్థకు ఎలా ఇచ్చారు. 1691 ఎకరాలు సింగపూర్ కంపెనీకి ఎలా ఇచ్చారు.  రాజధాని మీటింగ్ కి 4.91 కోట్లు ఎలా ఖర్చయ్యిందని అయన ప్రశ్నించారు.
రాజధాని బిల్డింగ్ ల నిర్మాణానికి  ఎల్ అండ్ టి, ఫాల్లోంజి కంపెనీలకు కాంట్రాక్ట్.  53 కోట్ల పనికి  ఫాల్లోంజి సంస్థ 103.42 కోట్లుకు,  ఎల్ అండ్ టి వాళ్ళు 106 కోట్లు కి టెండర్ అదనంగా వేశారు.   5 శాతం అదనంగా ఉండకూడదని నిబంధన ఉన్నా..  22 పర్సన్ట్   26 పర్సన్ట్ లకు పనులేలా ఇచ్చారని అయన నిలదీసారు. అదనంగా టెండర్లకు వేస్తే వాటిని రద్దుచేసి మళ్లీ ఎందుకు టెండర్లు పిలవలేదు.  ఆడిట్ వాళ్లకు రాజకీయాలతో సంబంధం ఉండదు.
ఆడిట్ లేవనెత్తిన తప్పులకు  ప్రభుత్వం తరపున కుటుంబరావు  సమాధానం చెప్పాలని అయన అన్నారు.  ఇంత ఆదనపురేట్లు ఏ ప్రాతిపదికన ఇచ్చారో చెప్పాలి. 10-07-18 న పోలవరం పే అండ్ ఇంజనీరింగ్ ఎకౌంట్స్ వారు స్పిల్ వే నిర్మాణం కోసం 101 కోట్లు ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తూ లెటర్ రాశారు.  దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని అయన డిమాండ్ చేసారు.
Tags:97 crores for a company?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *