Natyam ad

13అడుగుల పొడవున్న గిరినాగు పట్టివేత

అనకాపల్లి ముచ్చట్లు:

అనకాపల్లి జిల్లా ఎం.కోడూరులో భారీ గిరినాగు ఒకటి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు ఎలమంచిలి రమేశ్ తన పొలంలో కోళ్లను పెంచుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ గిరినాగు రాత్రి కోళ్లను వెంబడిస్తూ వాటి గూట్లోకి దూరింది. గమనించిన రైతు వెంటనే పాములు పట్టడంలో నిపుణుడైన వెంకటేశ్కు సమాచారం అందించాడు. ఆయన వచ్చి దాదాపు 20 నిమిషాలు శ్రమించి పామును పట్టుకున్నాడు. అనంతరం దానిని అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

 

Post Midle

Tags: A 13-feet-tall girinagu was caught

Post Midle