సంగమేశ్వరం వద్ద బ్రిడ్జితో బాటు బ్యారేజ్ నిర్మించాలి- చలో సంగమేశ్వరంలో రామచంద్ర యాదవ్
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల జిల్లా సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఐకానిక్ బ్రిడ్జికి బదులుగా బ్రిడ్జితో పాటు బ్యారేజ్ నిర్మించడం వల్ల రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు వస్తుంది. శనివారం చలో సంగమేశ్వరంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. నేను రైతు కుటుంబం నుంచి రావడంతో రైతు సమస్యలు, వారి ఇబ్బందుల గురించి అవగాహన ఉంది. తెలంగాణ నుంచి కర్నూలుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించడం వల్ల కేవలం రవాణాకు దూరం మాత్రమే తగ్గుతుంది. కానీ బ్రిడ్జి తో పాటు బ్యారేజ్ నిర్మిస్తే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు రావడం వల్ల లక్షలాది ఎకరాల భూములకు నీరు అందుతుంది. రవాణా దూరం తగ్గడంతోపాటు, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, విద్యుత్ తయారీ లాంటి ప్రయోజనాలు చేకూర గలవు. బ్రిడ్జ్ తోపాటు బ్యారేజ్ నిర్మించాలని చేపట్టిన ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. అవసరమైతే కేంద్ర రవాణా శాఖ మంత్రి గట్కారి, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షాకావత్, హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లేందు కృషి చేస్తా. రాయలసీమలో నీటి సమస్యలపై దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నఫలితం ఉండడం లేదు . రైతుల అభివృద్ధి,సంక్షేమం కోసం రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే సమస్య పరిష్కారం కాగలదు. కార్యక్రమంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, రాయలసీమ జిల్లాల నుంచి రైతు సంఘం నాయకులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

Tags:A barrage should be constructed at Sangameswaram along with a bridge- Chalo Ramachandra Yadav in Sangameswaram
