Natyam ad

అణగారిన వర్గాల ఆశాజ్యోతి….

సామాజిక అసమానతలను రూపు మాపేందుకు కృషి సల్పిన  మహాత్మా జ్యోతిరావు పూలే…
మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

అణగారిన వర్గాల ఆశా జ్యోతి, సామాజిక అసమానతలను రూపు మాపేందుకు కృషి సల్పిన మహా పురుషుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార శాఖ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డిఆర్ఓ పెంచల కిషోర్, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార ఇంఛార్జి అధికారి భాస్కర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.

 

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యమకర్త, సంఘసేవకుడు, సామాజిక తత్వవేత్త, మహిళా అభ్యుదయ వాది, నిరంతరం మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే ను యువత స్పూర్తిగా తీసుకోవాలన్నారు.సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి, వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త అని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతి రావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడన్నారు. సమ సమాజ స్థాపనలో భావితరాలకు  నిత్య స్ఫూర్తి ప్రదాతగా, కాంతి రేఖగా నిలిచారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్య నారాయణ, ఏబిసిడబ్ల్యుఓ కృష్ణయ్య, వెంకటేష్, జ్యోత్స్న, బిసి సంక్షేమ శాఖ, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

అనిల్ కపూర్ మాట్లాడుతూ..ఒక నటుడిగా నాకు జన్మనిచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమ, నామొదటి సినిమా వంశవృక్షం ది గ్రేట్ బాపు గారి దర్శకత్వంలో చేశాను. మళ్ళీ ఇప్పుడు యానిమల్ తో మీ ముందుకు వస్తున్నా.  లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చా. ఇది నాకు స్పెషల్ ఫీలింగ్. సందీప్ వంగా క్రేజీ, బ్రిలియంట్ దర్శకుడు. భూషణ్ గారు చిన్న వయసులోనే టీసిరిస్ సామ్రాజ్యాన్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ యానిమల్ లో ఏం చేశారో తెరపై చూడాల్సిందే. రష్మిక అదృష్టం ఈ చిత్రానికి కావాలి.  దాదాపు 43ఏళ్ల తర్వాత నేను చేసిన తెలుగు సినిమా ఇది. ఈ సినిమా బాబీ డియోల్ జీవితాన్ని మారుస్తుంది. మహేష్ బాబు గారితో ఎప్పటినుంచో మంచి అనుబంధం వుంది. మేమంతా ఒక ఫ్యామిలీలా వుంటాం. గ్లోబల్ సూపర్ డూపర్ డైరెక్టర్ రాజమౌళి గారు మనందరినీ గర్వపడేలా చేశారు. వారు ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది. డిసెంబర్ 1న ‘యానిమల్’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది”అన్నారు.

 

 

బాబీ డియోల్ మాట్లాడుతూ..తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అనందంగా వుంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. దర్శకుడు సందీప్ వంగా, టీసిరిస్ కు ధన్యవాదాలు. మహేష్ బాబు, రాజమౌళి గారు  ఈవేడుకలో వుండటం ఆనందంగా వుంది. మహేష్ బాబు గారు మొదటి సినిమా ముహూర్తానికి నేను హజరయ్యాను. అప్పుడు వారి స్టూడియోలోనే ఓ సినిమా చేస్తున్నా. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. యానిమల్ ని డిసెంబర్ 1న అందరూ చూడాలి’ అని కోరారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ మిగతా సభ్యులు పాల్గున్నారు.

 

Tags: A beacon of hope for the downtrodden…

Post Midle