సుందర నగరమే ప్రభుత్వ ధ్యేయం

కడప ముచ్చట్లు:


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కడప నగరాన్ని ఆరోగ్యకరమైన సుందర నగరంగా తీర్చిదిద్దుతామని, పేద ప్రజలు నవరత్నాల పథకాలను అందిపుచ్చుకోని లబ్ది పొంది ఆశీర్వదించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, నగర మేయర్ కె. సురేష్ బాబు లు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం నగరంలోని 50వ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ కె.అరుణ ప్రభ, డివిజన్ ఇంచార్జి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలెంపల్లి, రుకావారిపల్లి ప్రాంతాల్లో 26 వ రోజున “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, నగర మేయర్ కె. సురేష్ బాబు లకు మేళతాలలతో, బాణసంచతో ఘనంగా స్వాగతం పలికి, కార్యక్రమం గ్రామోత్సవంలా సాగింది.ఈ సందర్భంగా.. ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం  అమలుచేస్తోన్న  సంక్షేమ పథకాలు, సేవలు పట్ల లబ్ది దారుల మనోగతాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారిని కలుసుకోవడంతో పాటు, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి సంతకం చేసిన  బుక్ లెట్‌ను అంద‌జేశారు.

 

 

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు చేరుతున్నాయని.. ఉపముఖ్యమంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందడం.. జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందన్నారు. కరోనా లాంటి ప్రపంచ విఫత్కర పరిస్థితుల్లో కూడా..  ప్రజలు ఏ మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో.. సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందని ప్రశంసించారు. అమ్మఒడి, వైయస్సార్ పింఛన్ కానుక, వైయస్సార్ చేయూత వైయస్సార్ ఆసరా, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, వాహనమిత్ర వైయస్సార్ వసది దీవెన, వైయస్సార్ విద్య దీవెన, పేదలందరికీ ఇల్లు వంటి సంక్షేమ పథకాలను లబ్దిదారులకు వివరిస్తూ… గడపగడపకు  ఆయన పర్యటన సాగిందిపేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఒక్కరు కూడా.. సంక్షేమ పథకాలను కోల్పోకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి “గడప గడపకు మన ప్రభుత్వం”  కార్యక్రమాన్ని.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

సిసి రోడ్, డ్రైన్ కాలువకు శంకుస్థాపన
*కడప నగర సుందరికారణలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా, నగర మేయర్ కె.సురేష్ బాబు ల చేతుల మీదుగా 15వ ఆర్థిక నిధుల నుండి రూ.8 లక్షలు తో పాలెంపల్లి ప్రధాన రహదారి వద్ద సిసి రోడ్, డ్రైన్ కాలువకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రితో పాటు 50 డివిజన్ కార్పొరేటర్ అరుణ ప్రభ, డివిజన్ ఇంచార్జి రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు అఫ్జల్ ఖాన్, కాల్ టాక్స్ హఫీజుల్లా, ఇతర నగర కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ లు, డైరెక్టర్స్,  మున్సిపల్ ఎలెట్రికల్ డీఈ అబిద్, ఏ.ఈ. దిల్షాడ్,
సచివాలయం  సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: A beautiful city is the government’s mission

Leave A Reply

Your email address will not be published.