మధ్య తరగతికి పెద్ద పీట

Date:23/01/2021

న్యూఢిల్లీ ముచ్చట్లు:

క‌రోనా క‌రోనా క‌రోనా అని ఏడాది నుంచి దేశం మొత్తం దెబ్బ‌తినిపోయింది. ఈ టైంలో కేంద్రం ఆదుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక బ‌డ్జెట్ టైం కావ‌డంతో.. దేశం మొత్తం బ‌డ్జెట్ లో ఏం ఉండ‌బోతున్నాయి..సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ నిర్మ‌లా సీతారామ‌న్ మ‌ధ్యత‌ర‌గ‌తికి ఎలాంటి వ‌రాలు ఇవ్వ‌బోతున్నారు అనే పాయింట్ హాట్ టాపిక్ గా మారింది.ఇక నిర్మ‌ల‌మ్మ బ‌డ్జెట్ లో క‌రోనా కార‌ణంగా లాస్ అయిన వారికి ఓ దారి చూపే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఇన్నాళ్లు ఎలా ఉన్నా.. ఇక‌పై ఆ క‌ష్టాల‌నుగ‌ట్టెక్కించేలా బ‌డ్జెట్ రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు వ‌చ్చిన అన్ని బ‌డ్జెట్ లు ఎలా ఉన్నా.. రాబోయే బ‌డ్జెట్ లో మాత్రం.. మ‌ధ్య త‌ర‌గ‌తికి వ‌రాలు కురిపించేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ నిర్మ‌లా సీతారామ‌న్. ముఖ్యంగామూడు నిర్ణ‌యాలు అంద‌రికీ ఆశ‌లు పెంచేలా.. క‌ష్టాల నుంచి కాస్త గ‌ట్టెక్కించేలా ఉండ‌బోతున్న‌ట్లు టాక్ బ‌య‌టికి వ‌చ్చింది.

 

ముఖ్యంగా పీపీఎఫ్ పై అంద‌రికీ ఇంట్ర‌స్ట్ క్రియేట్ అయ్యే నిర్ణ‌యాలు తీసుకోబోతున్న‌ట్లు పొలిటిక‌ల్ గా టాక్ న‌డుస్తోంది. పీపీఎఫ్ ఇన్వెస్ట్ మెంట్ ప‌రిమితిని రెట్టింపు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ లో ల‌క్ష‌న్న‌రవ‌ర‌కు మాత్ర‌మే ఇన్వెస్ట్ చేసే అవ‌కాశం ఉంది. అయితే.. ఈ అవ‌కాశాన్ని.. డ‌బుల్ చేస్తార‌ట‌. అంటే.. మూడు ల‌క్ష‌ల వ‌ర‌కు ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయ‌ట‌. దీనిపై ఐసీఎఐ ప్ర‌తిపాద‌న‌లు పంపిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌తిపాద‌నకు సానుకూలంగా
సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ స్పందిస్తే.. మిడిల్ క్లాస్ కి బెన్ ఫిట్ క‌ల‌గ‌నుంది. పన్ను చెల్లించే వారికి ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితి పెంచితే.. ఆర్థికంగా ఉప‌యోగ‌ప‌డనుంది. వారి సేవింగ్స్ పెరుగుతాయ‌ని.. ఐసీఏఐ అంచ‌నా వేస్తోంది.ఇక క‌రోనా టైంలో.. అంద‌రికీ వైద్య ఖ‌ర్చులు పెరిగిపోయాయి. ప్ర‌తి హెల్త్ ప్రాబ్ల‌మ్ ని పెద్ద‌గా చూడ‌డం కూడా దీనికి రీజ‌నే. అయితే.. ఇన్సూరెన్స్ చెల్లించే విష‌యంలో కూడా పాతిక వేలు మిన‌హాయింపు స‌రిపోద‌ని.. మెడిక‌ల్ క‌వ‌రేజి మొత్తం పైమిన‌హాయింపు ఇవ్వాల‌నే డిమాండ్ వినిపిస్తోంది. ఈ డిమాండ్ కి కూడా సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ నుంచి.. సానుకూల స్పంద‌న వ‌చ్చేలా క‌నిపిస్తోంది. ఇవ‌న్నీ వ‌చ్చే బ‌డ్జెట్ లోనే నిర్ణయాలు జ‌రుగుతాయ‌ని.. మ‌రికొన్ని ప్లాన్స్ లో కూడా మెయిన్ గా

 

 

మిడిల్ క్లాస్ కి ఊర‌ట ఇచ్చేలా నిర్ణ‌యాలు తీసుకోబుతున్నార‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం లెక్క‌ల ప్ర‌కారం.. సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ నిర్మ‌లా సీతారామ‌న్.. ఆచి తూచి బ‌డ్జెట్ ప్రిపేర్ చేస్తున్నార‌ని.. పీఎం మోడీ నుంచి కూడా ఇలాంటి స‌జెష‌న్స్ వ‌చ్చానేది టాక్. సో..వ‌చ్చే బ‌డ్జెట్ లో ఎలాంటి నిర్ణ‌యాలు ఉండ‌బోతున్నాయి అనేది నేష‌న‌ల్ వైడ్ గా పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో ఇంట్ర‌స్ట్ క్రియేట్ అయింది

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags:A big plateau for the middle class

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *