తానేటి వనితకు చేదు అనుభవం
గుంటూరు ముచ్చట్లు:
హోం మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె సొంత నియోజకవర్గమైన కొవ్వూరులో అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థులెవరూ పోటీలో కనిపించలేదు. 11 డెరెక్టర్ స్థానాలను టీడీపీ బలపర్చిన అభ్యర్థులు ఏకగీవ్రంగా గెలుపొందారు. నూతన డైరెక్టర్లంతా కలిసి టీడీపీ నాయకుడు, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు మద్దిపట్ల శివరామకృష్ణను ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు.దీంతో మద్దిపట్ల శివరామకృష్ణ వరుసగా ఐదోసారి బ్యాంక్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే నాలుగుసార్లు టీడీపీకి చెందిన మద్దిపట్ల.. బ్యాంక్ చైర్మన్‌గా వ్యవహరించడంతో.. ఈ సారి ఎలాగైనా ఆయన్ను ఓడించాలని హోం మంత్రి తానేటి వనిత ముందుగానే పార్టీ శ్రేణులకు సూచించింది.త్రీమాన్ కమిటీ ద్వారా ఎన్నికలు వాయిదా వేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ టీడీపీ నాయకుల వ్యూహాలను పసిగట్టడంలో హోంమంత్రి వనిత విఫలమయ్యారు. ఇటీవల తిరుపతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో గెలిచిన తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ గెలుస్తామని వైఎస్సార్సీపీ భావించింది. కానీ అలా జరగకపోవడంతో.. కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఆరా తీసిందని సమాచారం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తానేటి వనిత కొవ్వూరు నుంచి 25 వేల మెజార్టీతో గెలుపొందడం గమనార్హం.
Tags: A bitter experience for Taneti woman

