ఉద్యోగాల భ‌ర్తీతో నిరుద్యోగుల‌కు ఊరట.

-యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
వరంగల్ ముచ్చట్లు:
శాసనసభలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటనపై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్ర సాధనలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వంగా టీఆర్‌ఎస్‌ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. నూతన ఉద్యోగ నియామకాలతో మరింత సర్వతోముఖాభివృద్ధి వైపు రాష్ట్రం సాగుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల సాకారం కానుంద‌న్నారు. కరోనా లాంటి క‌ష్ట‌కాలంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది నిరుద్యోగులకు సీఎం ప్రకటన కొత్త ఆశలు చిగురింపజేసింద‌న్న ఆయన ఉద్యోగాల భ‌ర్తీతో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతే కాకుండా ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించ‌డం సీఎం కేసీఆర్ చిత్త‌శుద్ధికి  నిద‌ర్శ‌ణమని వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు.
 
Tags:A blanket for the unemployed with job vacancies

Leave A Reply

Your email address will not be published.