Natyam ad

నాటు బాంబు పేలి ఒకరికి తీవ్ర గాయాలు

మహబూబాబాద్ ముచ్చట్లు:


మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లోని బయ్యారం పెద్ద చెరువు కట్టపై ఆదివారం రాత్రి బాంబు పేలుడు కలకాలం సృష్టించింది. ఈ ఘటన లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు క్షతగాత్రుడిని వరంగల్ ఎం.జి.ఎం కు   తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని దక్కన్ హాస్పిటల్ కు తరలించారు. కురవి మండలం గుండ్రాతిమడుగు సమీపం లోని రైల్వే గేట్ వద్ద గేట్ మెన్  గా పనిచేస్తున్న రవి తన మిత్రులు రాజు,ఉమేష్ లతో కలిసి బయ్యారం పెద్ద చెరువు సమీపం లోని గిరకతాడు కల్లు తాగేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతడి రెండు చేతులు పూర్తిగా నుజ్జు నుజ్జయ్యాయి. కళ్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో వచ్చిన కారులోనే మిగతా ఇద్దరు మిత్రులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం కు , అక్కడి నుండి హైద్రాబాద్ కు తరలించారు. సోమవారం ఉదయం బయ్యారం సిఐ బాలాజీ,ఎస్సై రమాదేవి లు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పేలుడు పదార్థాలతో చేపలు పట్టేందుకు ప్రయత్నించే సమయంలో పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నామని , విచారణ చేస్తున్నామని విచారణలో పూర్తి విషయాలు వెల్లడైతాయని సి.ఐ బాలాజీ తెలిపారు.

 

Tags: A bomb exploded and one person was seriously injured

Post Midle
Post Midle