ఉద్యోగులకు వరం

Date:03/07/2020

ఏలూరు ముచ్చట్లు:

ఆంధ్ర ప్రదేశ్ పొరుగు సేవల కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అందించిన ఒక వరమని జిల్లా కలెక్టర్  రేవు ముత్యాల రాజు చెప్పారు . శుక్రవారం తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ఆంధ్ర ప్రదేశ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ ను  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా   ప్రారంభించారు.  ఈ కార్యక్రమాన్ని ఏలూరు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ (వెల్ఫేర్ )  నంబూరి తేజ్ భరత్, ఎమ్మెల్సీ  రాము సూర్యారావు , చింతలపూడి శాసనసభ్యులు  ఎలీజా, వివిధ శాఖల జిల్లా అధికారులు వీక్షించారు . ఈ కార్యక్రమం అనంతరం వివిధ శాఖల్లో ఔట్ సోర్చింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు ఔట్ సోర్చింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ ఆర్డర్ పత్రాలను కలెక్టర్ అందజేశారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  రేవు  ముత్యాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన ఈ సువర్ణ అవకాశాన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు . క్రమశిక్షణతో నిబద్ధతతో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ఆయా శాఖల తో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా విధులు నిర్వర్తించాలని సూచించారు  . ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా ఇకపై దళారీలు, ప్రవేట్ ఏజెన్సీలకు చెల్లు చీటీ పాడినట్లు అవుతుందని అన్నారు . అవుట్  సోర్సింగ్  నియామకాల్లో ఎస్ టి ఎస్సీ బిసి మైనార్టీలకు 50 శాతం,  అలాగే మహిళలకు 50 శాతం ఉద్యోగాలలో రిజర్వేషన్లు  ఖచ్చితంగా అమలు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు.  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈఎస్ఐ ఈపీఎఫ్ విధానాలు కూడా సక్రమంగా అమలు జరుగుతాయని, జిల్లాలో  62 వివిధ శాఖల్లో పనిచేస్తున్న 1888 మందికి ఉద్యోగ భద్రతతో పాటు ప్రయోజనాలు లభించనున్నాయని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు.

డిస్కం లకు ఇచ్చే అప్పులో ఒక శాతం తగ్గించాలి

Tags: A boon for employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *