లోకేష్ పాదయాత్రకు విరామం

పిఠాపురం ముచ్చట్లు:


తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు మిచౌంగ్  తుఫాన్ ఎఫెక్ట్ తగిలింది.యూ.కొత్తపల్లి మండలం శీలంవారిపాకలు  వద్ద ఆదివారం సాయంత్రానికి పాదయాత్ర చేరుకుని,అక్కడే నారా లోకేశ్ రాత్రి బస చేసారు.సోమవారం ఉదయం తిరిగి ప్రారంభిద్దామనుకున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు తుఫాన్ కారణంగా విరామం ఇచ్చారు.తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత రెండ్రోజుల్లో తిరిగి శీలంవారిపాకలనుండి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలవుతుందని తెలుగుదేశంపార్టీరాష్ట్ర అధికార ప్రతినిధి,పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాకు తెలియజేశారు..కాగా.,మాజీ ఎమ్మెల్యే వర్మ కుటుంబ సభ్యులు లక్ష్మీదేవి,గిరీశ్ వర్మ,మనీషా,తదితరులు నారా లోకేశ్ ను కలిసి  ఘనంగా సన్మానించారు.

 

Tags: A break for Lokesh’s padayatra

Post Midle
Post Midle