ముక్కులో విరిగిన ‘స్వాబ్’ పుల్ల

కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లాలో కరోనా టెస్ట్ చేయించుకొనేందుకు  ప్రయత్నించిన సర్పంచ్ ముక్కులో టెస్టు చేసేందుకు వాడే స్వాబ్ పుల్ల విరిగిపోయింది. అది ముక్కు లోపల ఇరుక్కుపోవడంతో బయటకు రాలేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే అప్రమత్తమైన వైద్య అధికారులు సర్పంచ్ను కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.దీంతో అక్కడి వైద్యులు ముక్కులో ఇరుక్కుపోయిన పుల్లను వెలికితీశారు. రామడుగు మండలం వెంకట్రావుపల్లిలో కరోనా టెస్టుల కోసం ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ప్రారంభ సూచికగా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ జవ్వాజి శేఖర్ టెస్ట్ చేయించుకున్నారు. అతని ముక్కులో పెట్టిన స్వాబ్ పుల్ల విరిగిపోయింది.స్కాన్ చేసిన వైద్యులు ముక్కులో విరిగిపోయిన స్వాబ్ పుల్లను ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:A broken ‘swab’ stick in the nose

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *