స్నేహితుడుతో కలసి సొంత బావ మరదిని హత్య చేసిన బావ

రాయచోటి టౌన్ ముచ్చట్లు:

 

రెడ్డీస్ కాలనీ లోని సిద్దిక్ మసీదు డౌన్ వీదిలో నివాసం ఉన్న షేక్ అబ్దుల్ రహీం, తండ్రి – రెడ్డి బాష, 22సం॥లు అను అతడు గత కొంత కాలంగా రాయచోటి టౌన్, టాణా సమీపంలో గల మదరసా ఎదురుగా గల సందులో ఉన్న KGN చికెన్ సెంటర్లో కూలి పని చేస్తూ ఉండి, సొల్యుషన్ పీల్చడం, మద్యం తాగడం వంటి చెడు అలవాట్లు కలిగి, గత కొంత కాలంగా తన తల్లిని, సొంత అక్కను వేదిస్తూ డబ్బులు ఇవ్వమని వాళ్ళను నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉండగా వారు అతని వేదింపులు తట్టుకోలేక సదరు విషయం అబ్దుల్ రహీం సొంత పెద్ద అక్క భర్త అయిన షేక్ ఇర్షాద్ అలీ & సూరాకు చెప్పగా అతను చాలా సార్లు అబ్దుల్ రహీంను మందలించినా కుడా మారలేదని, అతనిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని 06.07.2024 వ తేదీన రాత్రి సుమారు 09.30 గంటల ప్రాంతంలో సదరు ఇర్షాద్ అలీ తన చిన్ననాటి స్నేహితుడైన రాయచోటి టౌన్, రాజుల కాలనీ, శ్యామల వారిపల్లి నందు నివాసం ఉన్న సాయి కుమార్ కు విషయం చెప్పి అతనితో కలసి అబ్దుల్ రహీం వాళ్ళ ఇంటికి పోయి అతనిని తీసుకొని గున్నికుంట సమీపంలో గల సమాధుల వద్దకు పోయి అబ్దుల్ రహీం ను కొట్టి, చాకుతో గొంతు కోసి హత్య చేసి శవాన్ని అక్కడే కంప చెట్లలో పడ వేసి ఇద్దరూ పరారీలో ఉండగా, ఆ విషయంలో చని పోయిన అబ్దుల్ రహీం తండ్రి ఇచ్చిన పిర్యాదు పైన రాయచోటి అర్బన్ PS Cr. No.347/2024, U/s 103(1), 238 r/w 3(5) BNS .

అరెస్ట్ కాబడిన ముద్దాయిల వివరాలు.

1. షేక్ ఇర్షాద్ అలీ @ సూరా, వయస్సు- 28 హహసం!!లు, తండ్రి. లేట్. మహమ్మద్ ఖాసిం, కులం- ముస్లిం, వృత్తి-కూలి, మహాబూబ్ నగర్, కొత్తపల్లి, రాయచోటి టౌన్, అన్నమయ్య జిల్లా.

2. మండెం సాయి కుమార్, వయస్సు-33 సం!!లు, తండ్రి-లేట్. రామక్రిష్ణా రెడ్డి, కులం-కాపు, వృత్తి- కూలి, శ్యామలవారిపల్లి, రాజుల కాలనీ, రాయచోటి టౌన్, అన్నమయ్య జిల్లా.

అయితే సదరు కేసు విచారణలో బాగంగా ఈ దినం అనగా 10.07.2024 వ తేదీన ఉదయం రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ అయిన యం.చంద్ర శేఖర్ గారికి రాబడిన ముద్దాయిల సమాధారం పైన ఇన్స్పెక్టర్ గారు, యస్.ఐ భక్తవత్సలం గారు మరియు సిబ్బంది, పంచాయతి దారులతోటి వీరబల్లి రింగ్ రోడ్ సమీపంలో ఉన్న కావల వాండ్లపల్లి గ్రామ క్రాస్ వద్ద సదరు ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక మొబైల్ పోన్ మరియు అబ్దుల్ రహీంను చంపుటకు వారు వాడిన చాకును స్వాదీనం చేసుకొని సదరు పైన తెలిపిన ఇద్దరు ముద్దాయిలను రాజశ్రీ కోర్ట్లో హాజరు పరచడం అయినది.

 

Tags: A brother-in-law who killed his own brother-in-law with a friend

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *