Natyam ad

విద్యార్ది దారుణ హత్య

అనంతపురం ముచ్చట్లు:


అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని ములకనూరు గ్రామానికి చెందిన 9వ తరగతి చదివే విద్యార్థి దండా అఖిల్‌ మే 21న కంబదూరు పోలీ్‌సస్టేషనలో అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. ఆ అదృశ్యమైన దండా అఖిల్‌ అతి దారుణంగా హత్య చేసినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది.ములకనూరు గ్రామానికి చెందిన శారదమ్మ, హనుమంతరాయుడు దంపతులకు ముగ్గురు పిల్లలు అఖిల్‌, వర్షిత, త్రిష ఉన్నారు. 8 నెలల క్రితం వర్షితను కంబదూరు మండలం గుద్దెళ్ల గ్రామానికి చెందిన అనిల్‌కిచ్చి వివాహం చేశారు. అనిల్‌ భార్య వర్షిత, మరదలు త్రిష, అత్త శారదమ్మను బాగా చూసుకుంటూ కుటుంబానికి పెద్దదిక్కుగా మారిపోయాడు. ఇంతలోనే అత్త శారదమ్మకు చెందిన 13 ఎకరాల భూమిపై అత్యాశ పెంచుకున్నాడు. ఆస్తికి అడ్డుగా ఉన్న బావమరిదిని చంపాలని కుట్ర వేశాడు. మే 21 ములకనూరు గ్రామంలో తిమ్మప్పస్వామి జాతర జరుగుతుండగా అఖిల్‌ అదృశ్యమయ్యాడు.

 

 

వెంటనే కంబదూరు పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. దీంతో సొంత బావ అయిన అనిల్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. విషయం తెలుసుకున్న అనిల్‌ పరారయ్యాడు. దీంతో అతని ఆచూకీ కనుగొని అరెస్ట్‌ చేయగా అసలు విషయం బహిర్గతమైంది. సెల్‌ఫోన ఇప్పిస్తానని అనిల్‌.. అఖిల్‌ను ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని గుద్దెళ్ల గ్రామంలోని తోటలోకి తీసుకెళ్లాడు. కాళ్లు, చేతులను డ్రిప్‌ వైర్లతో కట్టేసి, మెడపై మచ్చుకత్తుతో నరికి చంపి ముందుగానే తీసి ఉంచిన గుంతలో పూడ్చివేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీసులు అతడిని తీసుకుని ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఒక్కగానొక్క కుమారుడిని చంపిన అల్లుడిని కఠినంగా శిక్షించాలని అత్త శారదమ్మ కన్నీరుమున్నీరైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: A brutal murder of a student

Post Midle