యువకుడి దారుణ హత్య

-ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం

సూర్యాపేట ముచ్చట్లు:


ప్రేమ వ్యవహారంలో  ఓ యువకున్ని దారుణంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది.  పట్టణంలోని తాళ్లగడ్డ కు చెందిన చందనబోయిన దిలీప్( 20) హైదరాబాద్ లో ఏసీ రిపేరింగ్ వర్కర్ గా పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం సూర్యాపేటకు వచ్చాడు. దిలీప్ కు అదే తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో పలు సార్లు అమ్మాయి అన్నతో దిలీప్ కు గొడవ జరిగింది. ఈ క్రమంలో నిన్న రాత్రి మాట్లాడుదాం రమ్మని చెప్పి సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ పైకి పిలిచి మద్యం సీసాతో పొడిచి చంపారు.

 

Tags: A brutal murder of a young man

Leave A Reply

Your email address will not be published.