జెట్ ఎయిర్ వేస్ సంస్థకు బంపర్ ఆఫర్

A bumper offer for Jet Airways Company

A bumper offer for Jet Airways Company

Date:20/04/2019
ముంబై ముచ్చట్లు:
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి లాకౌట్ దిశగా అడుగులు వేసిన జెట్ ఎయిర్ వేస్ సంస్థకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. జెట్ విమాన సేవలు నిలిపివేసినందుకు ఆ సంస్థ విమానాలను తమకు లీజుకు ఇవ్వాలని ఎయిర్ ఇండియా ఛైర్మన్‌ అశ్విని లోహాని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌కు లేఖ రాశారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థిక సంక్షోభంతో అన్ని విమానసేవాలను ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌ దగ్గర ఇప్పుడు 16 అతి భారీ విమానాలు ఉన్నాయి. వాటిలో బోయింగ్‌కు 777-300ఈఆర్‌ విమానాలు 10 ఉంటే మిగిలిన ఆరు ఎయిర్‌బస్‌కు చెందిన ఏ330ఎస్‌ విమానాలున్నాయి. జెట్ విమానాల్లో ప్రస్తుతం 5 బోయింగ్‌ విమానాలను తమకు లీజుకు ఇస్తే కీలకమైన అంతర్జాతీయ రూట్లలో నడుపుతామని లేఖలో కోరారు. ఈ విషయమై రజనీష్‌ను లోహాని నేరుగా కలిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జెట్‌ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం లండన్‌, పారిస్‌, న్యూయార్క్, వాషింగ్టన్‌, చికాగో, శాన్‌ ఫ్రాన్సిస్కో వంటి నగరాలకు విమాన సర్వీసులు నడుపుతున్న దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా. జెట్‌ విమానాల లీజుకు ఒప్పందం కుదిరితే మరిన్ని నగరాలకు సేవలు విస్తరిస్తామని, ఇప్పటికే సేవలు అందిస్తున్న నగరాలకు విమానాల ఫ్రీక్వెన్సీని పెంచుతామని అన్నారు. ఎయిర్ ఇండియా ప్రతిపాదనకు జెట్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:A bumper offer for Jet Airways Company

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *