డ్రైవర్ లేకుండా కదిలిన బస్సు

నెల్లూరు ముచ్చట్లు:


“ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం”.. ఇది నిత్యం మనకు బస్సుల్లో (APSRTC) కనిపించే నినాదం. అయితే అలాంటి వాక్యాలు, మాటలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో అవి అమలు అవడం లేదు. ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన ఆర్టీసీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా నిత్యం ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఘటనల్లో ప్రయాణీకులు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. కొందరు జీవచ్ఛవాల్లా మారితే.. మరికొందరు మాత్రం ప్రాణాలే కోల్పోతున్నారు. సరిగ్గా నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు పరస్పరం ఢీ కొట్టుకున్నాయి. కండక్టర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఆ సమయంలో బస్సులో డ్రైవర్ లేకపోవడం గమనార్హం.

 

 

 

ఓ కారు వేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద కావలి (Kavali) నుంచి నెల్లూరుకు వెల్తున్న బస్సును ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది.ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. కారు వేగంగా ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్‌ ప్రసాద్‌.. డ్రైవింగ్ సీట్ నుంచి ఎగిరి రోడ్డు పై పడ్డారు. డ్రైవర్‌ లేకుండానే బస్సు ముందుకెళ్లింది. ఈ హఠాత్పరిణామానికి బస్సులో ఉన్న ప్రయాణికులు షాక్ అయ్యారు. భయంతో కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. అప్పుడు బస్సులోనే ఉన్న కండక్టర్ నాగరాజు స్టీరింగ్‌ వద్దకు వెళ్లి బ్రేకులు వేయడంతో బస్సు ఆగింది. కాగా.. అప్పటికే బస్సు దాదాపు 150 మీటర్ల వరకు ముందుకెళ్లింది. కండక్టర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

 

Tags: A bus that moved without a driver

Leave A Reply

Your email address will not be published.