చిన్నారిని చిదిమేసిన బస్సు

 Date:10/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
హాయత్ నగర్ శాంతినికేతన్ పాఠశాల స్కూల్ బస్ నిర్లక్ష్యం మూడు సంవత్సరాల చిన్నారి తన్విష్  ప్రాణాలని బలితీసుకున్న ఘటన అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని తరామతి పేట గ్రామము లో చోటు చేసుకుంది..స్కూల్ బస్ డ్రైవర్ అక్కడనుండి బస్ వదిలేసి పారిపోయాడురోజు మాదిరిగానే అన్న జశ్వంత్ (నర్సరి)ని స్కూల్ బస్ ఎక్కించి బాయ్ చెప్పటానికి అమ్మతో పాటు  వచ్చాడు మూడు సంవత్సరాల చిన్నారి తన్విష్ అప్పుడే వచ్చిన స్కూల్ బస్  ఎక్కగానే చిన్నారి చిరునవ్వుతో అన్నకి బాయ్ చెపుతూ ముందుకు కదిలాడు అంతలోనే అదే స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లాడు.దీంతో మృత్యువు రూపం లో చిన్నారి పై బస్సు  దూసుకువచ్చి ముందు టైర్ లతో తొక్కేసింది దీనితోకళ్ళ ముందలే అల్లారుముద్దుగా చూసుకునే  చిన్నారి తన్విష్ మృతి చెందడంతో కన్నతల్లి శోకాన్ని ఆపడం ఎవరితరం కావడం లేదు.వెంటనే గ్రామస్థులు డ్రైవర్ ని పట్టుకునే సమయానికి స్కూల్ బస్ వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు స్కూల్ యాజమాన్యం ఎలాంటి అనుభవం లేని డ్రైవర్ లకి తక్కువ జీతం ఇస్తూ పెట్టుకోవడం వలనే ఇలాంటి ఘటనలు జాతుగుతున్నాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు…
చిన్నారిని చిదిమేసిన బస్సు  https://www.telugumuchatlu.com/a-bus-that-was-born-baby/
Tags:A bus that was born baby

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *